గాంధీ సత్యాగ్రహం
పటేల్ నిర్వహణ
రాజేంద్ర ప్రసాద్ ఆలోచన
నెహ్రూ భారీ కలలు
అంబేద్కర్ విచక్షణ
కలగలసిన అమృతభాండం
భారత జాతి స్వతంత్రం.
స్వార్ధపూరిత ముఠా రాజకీయుల
జేబులు నింపుకునే స్కాములు,
సంక్షేమం పేరిట జనం డబ్బును
ఓట్లకోసం పంచిపెట్టే
అతితెలివి నాయక ధర్మాత్ములు
స్వతంత్ర భారతిని
నిత్యం ఏడిపించే మొనగాళ్లు.
దేశాన్ని బాగు చెయ్యడానికి
తలసరి ఆదాయం పెంచడానికి
చక్కటి చదువే మూలం
చిక్కటి పరిశోధనలే ఆధారం.
ప్రతి సంవత్సరం పియల్ 480 పేరిట
అమెరికా బిక్షం అందితేనే
తినే స్థాయినుండి
నేడు ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం
స్వామినాథన్ హైబ్రిడ్ గోధుమల సృష్టితో.
అలాంటి కృషి పారిశ్రామిక రంగంలో
టాటాలు మొదలు పెట్టినా
స్వతంత్రం తరువాతి
సోషలిస్టు నాయకత్వంతో
దశాబ్దాలు కరిగిపోయాయి దరిద్రంలో.
నెహ్రూ కుటుంబం తప్పుకున్నపుడు
మొదలైన ఆర్ధిక సంస్కరణలు
బడాబాబుల జేబులే నింపాయి.
చదువును సంస్కరిస్తే
పరిశోధన చక్కగా జరిగితే
కొన్ని శతాబ్దాలుగా
ముడిసరుకు ఎగుమతి చేసి
వస్తువులను దిగుమతి
చేసుకునే ఖర్మ పట్టకపోను.
ఇప్పుడు స్వయంసమృద్ధి అంటూ
మార్పులు తెస్తున్నారు
దశాబ్దాల తర్వాత.
ఇంతవరకు పదిహేను శాతం
విద్యార్థుల సామర్ధ్యమే
మన అభివృద్దికి కారణం.
విద్య, పరిశోధన బాగుపడితే
అందరు విద్యార్థులు సమర్ధులైతే
సాంకేతికత మన స్వంతమైతే
ప్రపంచం మనకు దాసోహం.
ఆ రోజు సాక్షాత్కరించడానికి
నేతలు, మనం ఏం చేయాలో చేసి
స్వతంత్రానికి నిజమైన అర్థాన్ని
ఆచరణలోకి తెద్దాం
మన భవిత ఉజ్వలం చేద్దాం.
Also read: “చెప్పుల జోడు”
Also read: “లేమి’’
Also read: “కాలాక్షేపం”
Also read: ‘‘వసంతం’’
Also read: పరిణామం