- పోలింగ్ కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
- ఓటర్లకు మద్యం, బిర్యానీ పంపిణీ
- రాను పోను ప్రయాణ ఖర్చులు
ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమయింది. ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నా బీజేపీ జనసేనలు కూడా తమ మనుగడకోసం ప్రయత్నిస్తున్నాయి. తొలిదశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రలోభాల పర్వం భారీగా నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో కీలకం. దీంతో హైదరాబాద్ లో ఉన్న తమ వారిని రప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. హైదారాబాద్ నుంచి స్వగ్రామం వచ్చి వెళ్లే వరకు ప్రయాణ ఛార్జీలతో పాటు సకల సదుపాయాలు కల్పించనున్నారు.
తొలిదశలో 3249 పంచాయతీల పరిథఇలో 32502 వార్డులకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందుల 518 పంచాయాతీలు ఏకగ్రీవమయ్యాయి. రేపు 2731 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటలను చి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి సర్పంచ్ ని ప్రకటిస్తారు. పోలింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసి పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
Also Read: మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు:
తొలిదశ పోలింగ్ కు పోలీసు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను సాధారణ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ప్రలోభాలు షురూ!
ప్రచారాలు ముగియడంతో ఇక ఓటర్లకు ప్రలోభాలు విసురుతున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఏ పార్టీకి చెందిన వారైనా ఖర్చుకు మాత్రం వెనకడుగు వేయడంలేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలావు ప్యాకెట్లు, మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది. ఆర్థిక స్తోమతను బట్టి ఒక్కో ఓటుకు వేలల్లో ఆఫర్ చేస్తున్నారు. పోలింగ్ కు 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూసివేసినా బరిలో ఉన్న అభ్యర్థులు ముందే కావాల్సినంత సరుకు కొని సిద్ధంగా ఉంచుకున్నారు.
Also Read: ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కొరడా!