- బొటనవేలు చిట్లడంతో ఆఖరి రెండుటెస్టులకూ దూరం
అనుకున్నంతా జరిగింది. సిడ్నీటెస్ట్ ముగియటానికి మరో రెండురోజుల ఆట మిగిలి ఉండగానే భారత్ కు కోలుకోలేని దెబ్బ తగలింది. భారత తొలిఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తూ కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ బౌలింగ్ లో గాయపడిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఎడమచేతి బొటనవేలు చిట్లినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. దీంతో జడేజా సిరీస్ లోని ఆఖరి రెండుటెస్టులకూ దూరం కాక తప్పదని టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.
ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న ఈ కీలక టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టిన జడేజా బ్యాటింగ్ లో సైతం పోరాడి ఆడి 28 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు.
Also Read : సిడ్నీటెస్టుపై కంగారూ పట్టు
ఆట 99వ ఓవర్ లో ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ బౌలింగ్ కు దిగిన సమయంలో జడేజా ఎడమచేయి బొటనవేలికి గాయమయ్యింది. జడేజా చేతివేలిని బంతి బలంగా తాకడంతో భరించలేని బాధతోనే బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ కు సైతం దూరంగా ఉండాల్సి వచ్చింది. భారతజట్టుకు తన ఆల్ రౌండ్ ప్రతిభతో కొండంత అండగా నిలిచే రవీంద్ర జడేజా సిడ్నీటెస్ట్ ఆఖరి రెండురోజుల ఆటతో పాటు నాలుగోటెస్టుకు అందుబాటులో లేకపోడం గట్టి దెబ్బే.
Also Read : సిడ్నీ టెస్టులో శుభ్ మన్ గిల్ అరుదైన రికార్డు
గాయపడిన మరోఆటగాడు, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ కు ఎలాంటి ఫ్రాక్చరూ కాలేదని టీమ్ మేనేజ్ మెంట్ తెలిపింది. సిడ్నీ టెస్ట్ నాలుగో రోజు ఆటలో పంత్ వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
Also Read : సిడ్నీటెస్ట్ మూడోరోజున అశ్విన్ ప్రపంచ రికార్డు