రామాయణమ్ – 154
ఇతను నన్ను కూడా బంధింపజేసి ఇక్కడకు రప్పించుకున్నాడుకదా అన్నట్లుగ్గా ఎర్రబారిన కన్నులతో రావణున్ని తేరి పార చూశాడు ఆంజనేయుడు.
సమున్నతమైన రత్న ఖచిత సింహాసనంపై పట్టుబట్టలు ధరించి ఆసీనుడై ఉన్నాడు రాక్షస రాజు. వంటి మీద చిత్రవిచిత్రములుగా బొమ్మలు చిత్రింపబడి.
ఎత్తైన మందర పర్వతములాగా ఉన్నాడు. సుందరముగా ఎర్రనైన కనులతో చూడటానికి భయంకరముగా ప్రకాశించే పది తలలతో విచిత్రముగా ఉన్నాడు రావణుడు.
Also read: బ్రహ్మాస్త్రానికి బద్ధుడైన వాయుసుతుడు
కాటుక కొండలాగా నల్లగా ఉన్నాడు. బలగర్వితులైన నలుగురు మంత్రులు ఆయన చుట్టూ ఉన్నారు.
ఒక ప్రక్క భటులు తనను శూలాలతో పొడుస్తూ బాధిస్తున్నప్పటికీ పరిశీలనగా చూస్తున్నాడు రాక్షసరాజును హనుమంతుడు.
రావణుని చూస్తూ ఆయనగురించి మనస్సులో ‘‘ఆహా ఈమి రూపము, ఏమి ధైర్యము, ఏమి బలము, ఏమి కాంతి, ఏమి సర్వలక్షణ సంపన్నత్వము.
Also read: రావణ సుతుడు అక్షకుమారుడి వధ
ఈయనలో ఈ బలవత్తరమైన అధర్మమే లేకున్నట్లయిన త్రిలోక పూజ్యుడు, ప్రభువు అయి ఉండేవాడు కదా! ఈయన జగత్తంతటినీ హింసిస్తూ ఉండటము చేత అందరూ ఈయనకు భయ పడతున్నారు కదా.’’
అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అనుకుంటున్నాడు హనుమస్వామి
ఎవరీ వానరుడు?
గోరోజనపు రంగులో కళ్ళు ఉన్నాయి! ముఖములో అమితమైన తేజస్సు ఉట్టిపడుతున్నది! మనస్సులో ఏవో శంకలు రావణుని మదిలో కదలాడుతున్నాయి!
ఇతడెవరై ఉండును? వానర రూపములో ఇచటికేతెంచిన బాణాసురుడా?
Also read: అనేకమంది రాక్షస యోధులను యమసదనానికి పంపిన హనుమ
లేక నేను పూర్వము కైలాసమును కదల్చినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడే ఈ రూపములో ఇచటికి వచ్చినాడా? సరే !!
“ప్రహస్తా! ఈ దురాత్ముడెవ్వరో, ఎచటినుండి ఇటకేతెంచినాడో, వనాన్ని ద్వంసం ఎందుకు చేసినాడో, రాక్షసస్త్రీలను ఎందుకు భయపెట్టినాడో, ఏ ప్రయోజనము నెరవేర్చుకోవాలని వచ్చినాడో, ఎందుకు యుద్ధము చేసినాడో ఈ దుర్మతిని అడుగు” అని ఆజ్ఞాపించాడు.
అప్పుడు ప్రహస్తుడు …‘‘ఓ వానరుడా! నీకేమీ భయములేదు! నిన్ను ఎవరు ఇక్కడికి పంపారు? ..ఇంద్రుడా? కుబేరుడా? యముడా? వరుణుడా? లేక ఆ విష్ణువా?
‘‘ఓయీ నీవు రూపమునకు మాత్రమే వానరుడవు కానీ నీ తేజస్సు మాత్రము వానరులకు ఉండదగినది కాదు ….ఇప్పుడు సత్యము చెప్పుము ..నీకు భయములేదు….అసత్యము చెప్పినచో క్షణకాలముకూడా జీవించవు …’’అని ప్రశ్నించాడుప్రహస్తుడు ….
Also read: హనుమపై రాక్షసమూక దాడి
వూటుకూరు జానకిరామారావు