- సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డును బహూకరించిన స్కోచ్ సంస్థ
- అవార్డు ఎంపికకు వందకు పైగా ప్రాజెక్టులు అధ్యయనం చేసిన స్కోచ్ గ్రూప్
- పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రవేశపెడుతున్న వినూత్న సంక్షేమ పథకాలు ఆయనకు ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు తెచ్చిపెట్టాయి. 2020-21 సంవత్సరానికి సంబంధించి ‘స్కోచ్ సీఎం’గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ సంస్థ ఎంపిక చేసింది. దేశంలో మెరుగైన పనితీరుతో పాటు ప్రజలకు అందించిన సేవలను పరిగణనలోకి తీసుకున్న స్కోచ్ సంస్థ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్కోచ్ సంస్థ ప్రతినిధి సమీర్ కొచ్చర్ సీఎం జగన్‌ను కలిసి అవార్డును బహూకరించారు. ఈ సందర్భంగా కోచ్చర్ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి అవార్డును అందజేసి అభినందించారు.
Also Read: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించండి: ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు వైఎస్ జగన్. పేదలు, మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలిచే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డుతో స్కాచ్ గ్రూప్ సత్కరించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్ని అధ్యయనం చేసి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టు స్థాయి ఫలితాల అధ్యయనం ఆధారంగా స్కోచ్ సీఎంగా జగన్‌ను ఎంపిక చేసినట్లు సంస్థ ప్రకటించింది.