- 87 ఏళ్లలో రంజీకి తొలిసారి విరామం
- దేశవాళీ క్రికెటర్లకు బీసీసీఐ నష్టపరిహారం
భారత దేశవాళీ క్రికెట్ అనగానే ఏటా జరిగే రంజీట్రోఫీ సమరమే గుర్తుకు వస్తుంది. దేశంలోని ఐదుజోన్లకు చెందిన 30కి పైగా జట్ల మధ్యజరిగే ఈ వార్షిక పోరు నుంచే.. భారత జాతీయజట్టు అవసరాలకు తగిన ఆటగాళ్లు తెరమీదకు రావడం మనకు తెలిసిందే. అయితే…కరోనా వైరస్ దెబ్బతో 2020-21 సీజన్ రంజీటోర్నీని రద్దు చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా…ఓ లేఖ ద్వారా అనుబంధ క్రికెట్ సంఘాలకు సమాచారం పంపారు.
Also Read : భారత అంపైర్లకు భలే చాన్స్
బయోబబుల్ వాతావరణంలో…స్టేడియాల గేట్లు మూసి సయ్యద్ ముస్తాక్ అలీ లాంటి దేశవాళీ పరిమిత ఓవర్ల టోర్నీలు నిర్వహిస్తున్నామని… కరోనా ముప్పుతో ఈ ఏడాది పూర్తిస్థాయి దేశవాళీ సీజన్ నిర్వహించే అవకాశమే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అనుబంధ క్రికెట్ సంఘాలు, క్రికెటర్లు, అంపైర్లు, క్రికెట్ తో అనుబంధం ఉన్న అన్ని వర్గాలవారితో సంప్రదించి, వారి సలహాలు,సూచనల ప్రకారమే రంజీ సీజన్ ను రద్దు చేసినట్లు బోర్డు కార్యదర్శి వివరించారు.
రంజీ సీజన్ రద్దు ఇదే మొదటిసారి
ప్రపంచంలోనే అత్యంత పురాతన దేశవాళీ క్రికెట్ టోర్నీలలో ఒకటిగా పేరున్నరంజీట్రోఫీకి 87 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే మనదేశంలో నిర్వహిస్తూ వస్తున్న రంజీసమరం..ప్రపంచ యుద్దాల సమయంలోనూ నిలిచిపోలేదు. అయితే..ప్రస్తుత కరోనా దెబ్బతో మాత్రం తొలిసారిగా సీజన్ కు సీజన్ పోటీలు రద్దుల పద్దులో చేరిపోయాయి.
Also Read : భారత క్రికెటర్లకు కోవిడ్ పరీక్షలు
దేశవాళీ క్రికెటర్లకు నష్టపరిహారం..
రంజీట్రోఫీ ద్వారా ఎంతో కొంత ఆర్జిస్తూ మనుగడ సాగిస్తున్న వందలాదిమంది దేశవాళీ క్రికెటర్లకు…సీజన్ రద్దు కారణంగా జరిగిన నష్టాన్ని పరిహారం రూపంలో చెల్లిస్తామని..బోర్డు కార్యదర్శి జే షా హామీ ఇచ్చారు. రంజీ క్రికెటర్లకు రోజుకు 50 వేల రూపాయల చొప్పున మ్యాచ్ ఫీజుగా చెల్లిస్తూ వస్తున్నారు.
రంజీ సీజన్ రద్దయినా… బయోబబుల్ వాతావరణంలోనే విజయ్ హజారే ట్రోఫీ, సీనియర్ మహిళా వన్డే టోర్నమెంట్‌ను ఏకకాలంలో నిర్వహిస్తామని, జాతీయ అండర్ -19 వన్డే టోర్నీ వినూ మన్కడ్ ట్రోఫీని సైతం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వన్డే టోర్నీలలో పాల్గొనే క్రికెటర్లకు మ్యాచ్ కు లక్షన్నర రూపాయల చొప్పున మ్యాచ్ ఫీజు చెల్లిస్తామని వివరించారు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన అనుబంధ సంఘాలకు జే షా తన లేఖలో కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : వరల్డ్ టూర్ టోర్నీ నుంచి కిడాంబీ శ్రీకాంత్ నిష్క్రమణ
ఏటా వందలకోట్ల రూపాయల వర్షం కురిపించే ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయంతోనే అంతర్జాతీయ క్రికెటర్లను,దేశవాళీ క్రికెటర్లను బీసీసీఐ ఆదుకొంటూ వస్తోంది.
Also Read : కరాచీటెస్టులో పాకిస్థాన్ జోరు