- వాక్సినేషన్ పై అపోహలు నమ్మొద్దన్న కమిషనర్
గోదావరిఖని పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ , పోలీస్ అధికారులు మరియు సిబ్బంది బుధవారం ఉదయం వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కోవిడ్ నుండి బయట పడాలని త్వరితగతిన వ్యాక్సిన్ ని తెప్పించి తొలుత ఫ్రoట్ వారియర్స్ పోలీస్, మెడికల్, మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడం జరుగుతోంది. వ్యాక్సిన్ వలన దుష్ప్రభావాలు ఉన్నాయని కొంతమంది అపోహలు సృష్టించారని ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని కమిషనర్ తెలిపారు. ప్రతిఒక్కరు వ్యాక్సిన్ ను విడతలవారీగా పోలీసు అధికారులు సిబ్బంది రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా వేస్తున్న వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కమీషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ స్పెక్టర్ సతీష్ మరియు డాక్టర్ కృప బాయ్ (డిస్ట్రిక్ట్ ఇంయునేషన్ ఆఫీసర్), డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ భీష్మ, RMO, డాక్టర్ సురేష్ బాబు, మెడికల్ ఆఫీసర్, జమున నర్సింగ్ సూపరింటెండెంట్, నాగమణి, ట్రాఫిక్ ఎస్ ఐ నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.
Also Read: నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు కీలకం