Thursday, November 7, 2024

బంగారం కేసును చేధించిన రామగుండం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు..

  • 2 కిలోల 30 తులాల బంగారం పట్టివేత

మంచిర్యాల : బుదవారం తేదీ 24.03.2021 ఉదయం 07:30 గంటల సమయం లో 108 ఆంబులెన్స్ EMT తాజుద్దీన్ ని రమేష్ నగర్ గోదావరిఖని అతని ఇంటి వద్ద, గుజ్జుల లక్ష్మారెడ్డి ని ఉదయం 10:00 గంటలకు గోదావరిఖని బస్టాండ్ వద్ద అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ప్లాస్టిక్ కవర్లలో ఉన్న 2 కిలోల 300 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసు లు స్వాధీనం చేసుకొన్నారు .వాటి విలువ సుమారు ఒక కోటి 15 లక్షలు ఉంటుంది.

వివరాల్లోకి వెళితే

గుంటూరు జిల్లా నరసరావుపేట గ్రామం చెందిన ముగ్గురు వ్యక్తులు 1.కొత్త శ్రీనివాసరావు s/o వెంకటేశ్వర్లు, 2.కొత్త రాంబాబు సన్నాఫ్ వెంకటేశ్వర్లు 3.గుండ సంతోష్ లు కలిసి బంగారం వ్యాపారం చేస్తారు. వీరు ఆర్డర్స్ మీద వివిధ జిల్లాల్లో గల బంగారు వ్యాపారులకు బంగారం ఆర్నమెంట్స్ సప్లై చేస్తారు. అట్టి బంగారం ఆభరణాలు సప్లై చేయుట కొరకు ఈ ముగ్గురు వ్యక్తులు ఒక డ్రైవర్ సంతోష్ కుమార్ అనే వ్యక్తి సాయంతో తేదీ 22 2020 21 రోజున రాత్రి నరసరావుపేట గుంటూరు జిల్లా నుండి ఒక కారు దాని నెంబర్ AP07CW4005,ET10S లో 5,600 గ్రాముల బంగారాన్ని పై ముగ్గురు వ్యక్తులు వారి వారి షర్ట్ లోపలి పోకేట్ లో పెట్టుకొని వస్తుండగా మార్గమధ్యంలో తేదీ 23.2.2021 రోజు ఉదయం 5 గంటలకు మల్యాల పల్లి రామగుండం మూలమలుపు వద్ద డ్రైవర్ సంతోష్ కుమార్ నిద్రమత్తులో రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీ కొట్టగా అందులో ప్రయాణిస్తున్న కొత్త శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయాడు. గంట సంతోష్ ను 108 అంబులెన్స్లో EMT చాంద్, డ్రైవర్ రాజేంద్రర్ లో ఆస్పత్రికి తరలించడం జరిగింది .అతని షర్ట్ జేబులో అందాజ 1 కేజీ బంగారం ఆభరణలు EMT చాంద్, డ్రైవర్ రాజేంద్ర నాకు దొరకగా అట్టి బంగారు ఆభరణాలను వారు ఆస్పత్రి వద్ద రామగుండం ఎస్ఐ శైలజ గారికి అందజేసినారు. మరియు డ్రైవర్ సంతోష్ కుమార్ ను HKR అంబులెన్స్ లో గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కోన ఉపిరి తో ఉన్న కొత్త రాంబాబుని కమాన్పూర్ కి చెందిన అంబులెన్స్లో108 అంబులెన్స్ ENT తాజుద్దీన్, డ్రైవర్ గుజ్జుల లక్ష్మారెడ్డి గోదావరిఖని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.

Also Read: తీరనున్న లోవోల్టేజ్ కరెంటు సమస్య

యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో కొత్త శ్రీనివాస్ వద్ద రామగుండం పోలీసువారికి అందాద 2,300 గ్రాముల బంగారు ఆభరణాలు దొరికినవి. కానీ మృతుల కుటుంబ సభ్యులు/ఫిర్యాదు కొత్త నాగేశ్వరరావు గారు రామగుండం పోలీస్ స్టేషన్ కి వచ్చి మా వారి వద్ద మొత్తం అందాద 5,600 గ్రాముల బంగారు ఆభరణాలు ఉండాలి కానీ వారి వద్ద మొత్తం 3 కిలోల 300 గ్రాములు మాత్రమే బంగారు ఆభరణాలు దొరికినాయి మిగిలిన 2 కిలోలు 300 గ్రాములు బంగారం దొరకలేదు కావున దొంగతనం జరిగిందని దరఖాస్తు ఇవ్వగా దరఖాస్తు స్వీకరించిన రామగుండం ఎస్ఐ శైలజ గారు రామగుండము సర్కిల్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ రావు గారు కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో రామగుండం స్థానిక పోలీసులకు సిఐ టాస్క్ఫోర్స్ మరియు వారి సిబ్బంది పోలీసులు కూడా సహకరించారు.

Also Read: లాయర్ దంపతుల హత్యను సీరియస్ గా తీసుకొన్న పోలీసులు

కేసు విచారణలో భాగంగా ఆంబులెన్స్ EMT, డ్రైవర్ను విచారించగా కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన 108 అంబులెన్స్ ENT డి తాజుద్దీన్, డ్రైవర్ గుజ్జుల లక్ష్మారెడ్డి సహాయంతో 108 ఆంబులెన్స్ లో కొత్త రాంబాబు అనే వ్యక్తిని గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తీసుకుని వస్తూమార్గం మద్యలో చికిత్స అందించడానికి అతని షర్ట్ ని పైకి అని ట్రీట్మెంట్ అందించే క్రమంలో కొత్త రాంబాబు షర్ట్ లోపల గల జేబులో ఉన్న రెండు ప్లాస్టిక్ కవర్లలో అందాజ 2 కిలోల 300 గ్రాముల బంగారం చూసేసరికి తాజోద్దీన్ కి మనసులో దురాశ కలిగి ఇట్టి విషయాన్ని డ్రైవర్ గుజ్జుల లక్ష్మారెడ్డి కి చెప్పగా తను కూడా సరే అనగా 2 ప్లాస్టిక్ కవర్ లో ఉన్న బంగారు ఆభరణాలను చెరొక బంగారు ఆభరణాల కవర్ ని తీసుకుని దర్జాగా బ్రతకవచ్చు అని ఆలోచించుకొని వాటిని పంచుకొని కొత్త రాంబాబు మృతదేహం ని ఆస్పత్రుల్లో దింపి అక్కడ అందరి ముందు మృతదేహం ని పరిసిలిన్వ్హినట్టు నటించి అతని వద్ద ఏమి లేదు అని చెప్పి వారు అక్కడ నుండి వారు ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాలు దాచిపెట్టి ఎవరు డ్యూటీకి వారు వెళ్లిపోయారు అని వారు తెలపడం జరిగింది.3,300 గ్రాముల బంగారం కి సంబందించిన అనుమతుల పత్రాలను ,రశీదులను పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని సిపి గారు అన్నారు.

దొంగిలించబడిన బంగారాన్ని పట్టుకోవడం ప్రతిభ చూపెట్టిన రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు,టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజకుమార్,ఎస్ ఐ శైలజ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది శ్రీనివాస్, ప్రకాష్, మల్లేష్ లను సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు

Also Read: బొగ్గు అక్రమ తవ్వకాలు, స్మగ్లింగ్

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రవీందర్, అడిషనల్ డీసీపీ కమాండెంట్ సంజీవ్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్,రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు,రామగుండం టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రాజ్ కుమార్, రామగుండం ఎస్ఐ శైలజ పాల్గొన్నారు.

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles