Thursday, December 26, 2024

విభీషణుడు స్వాగతించదగినవాడేనన్న రామచంద్రుడు

రామాయణమ్  – 174

హనుమంతుని మాటలు శ్రద్ధగా విన్నాడు రామచంద్రుడు. తన మనస్సులో మాట చెప్పటం మొదలు పెట్టాడు.

‘‘ప్రియబంధువులారా, ఒక మాట. నన్ను మిత్రుడుగా భావించి నా వద్దకు వచ్చిన వానిలో దోషములెన్ని ఉన్నా నేను విడువను, విడువలేను.’’

రాముడు ఈ మాట పలుకగనే సుగ్రీవుడు, ‘‘రామా, వీడు దుష్టుడా ,శిష్టుడా మనకు అనవసరం. కానీ ఆపదలో ఉన్న అన్ననే విడిచి వచ్చిన వాడు రేపు మనలను విడువడని నమ్మకమేమిటి?’’

Also read: విభీషణుడిని మిత్రుడిగా స్వీకరించమని రాముడికి హనుమ సూచన

సుగ్రీవుని ఈ పలుకులకు చిరునవ్వు నవ్వుతూ, లక్ష్మణుని వైపు తిరిగి ‘‘శాస్త్రములు చదువని వాడు ఈ రకముగామాటలాడలేడు .కానీ ఇక్కడ ఒక సూక్ష్మ విషయమును పరిశీలన చేయవలెను.

‘‘అది లోకములోని రాజులందరకు అనుభవమే….అనుచూ రాముడు చెప్పటం మొదలుపెట్టాడు.

‘‘రాజులకు రెండువిధాలుగా శత్రువులు ఉంటారు. ఒకరు తన ఇంటిలోని జ్ఞాతులు రెండు తన దేశాన్ని ఆనుకుని ఉన్న సరిహద్దు రాజ్యమువారు.వీరుఇరువురూ సమయము కోసము ఎదురుచూస్తూ ఉంటారు .ఎప్పుడయితే రాజుకు సంకటపరిస్థితి ప్రాప్తించిందో అదను చూసి పదునైన దెబ్బ వేస్తారు.

Also read: మగువల విషయంలో శాపగ్రస్తుడు రావణుడు

‘‘రావణుడు కూలిపోక తప్పదు అతని వ్యసనము అతనిని కూల్చబోవు చున్నది. ఆ సంగతి బాగుగా గ్రహించినవాడు కావున విభీషణుడు మనతో జట్టు కట్టుటకు వచ్చినాడు. అన్ననే వదలినవాడు మనలను వదలడా అని సుగ్రీవుని సందేహము. అది జరుగుటము ఆస్కారములేదు ఏలనగా మనతో భవిష్యత్తులో కూడా అతనికి శత్రుత్వము ఏర్పడే అవకాశము లేదు ఏలనన మనము ఆతని సరిహద్దు రాజ్యము వారలము కాము. అతని జాతి వారమూ కాము. కావున ఇంతకన్న మంచి అవకాశము అతనికిఎప్పుడు లభించును? ఇతనికి రాజ్యమందు కోరిక ఉన్నది.

‘‘రాక్షసుడే కదా ఈతడు. బుద్ధిహీనుడేమో అని శంకించంకండి. కులమును బట్టి బుద్ధిని నిర్ణయింపలేము .వారిలో కూడా గొప్ప మేధో సంపన్నులు పండితులు కలరు . కావున ఈతడు మిత్రుడుగా గ్రహింపదగినవాడే. జ్ఞాతులెవ్వరూ భయములేక సంతోషముగా కలిసి ఉండజాలరు. నా వంటి పుత్రుడు, సుగ్రీవుని వంటి మిత్రుడు, భరతుని వంటి సోదరులు ఎక్కడా ఉండరు.’’

Also read: సీతను తెచ్చుట పొరబాటు, కుంభకర్ణుడు

 ( శ్రీరామచంద్రుడు ఇలా ఎందుకన్నారో రేపటి భాగంలో చూడవలసినదే)

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles