తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తమ నటుడు రజనీకాంథ్ రాజకీయ ప్రవేశ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. ఈ రోజు (సోమవారం) చెన్నైలో ఏర్పాటైన సమావేశం కూడా అర్థంతరంగానే ముగిసింది. రజనీ మక్కల్ మండ్రం (ఆర్ఎంఎం)కు చెందిన 50 మంది కీలక ప్రతినిధులతో రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో సమావేశమైన అనంతరం రజనీ నేరుగా పోయెస్ గార్డెన్ లోని తన నివాసానికి చేరుకుని మీడియాలో మాట్లాడారు. ఆర్ఎంఎం కార్యదర్శులు, తాను పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నామని. రాజకీయ రంగ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు
ఇప్పడే వద్దులే
రజని మీడియా సమావేశంలో `త్వరలో రాజకీయ ప్రవేశ ప్రకటన` అని చెప్పినా, ఆర్ఎంఎం సమావేశంలో అందుకు భిన్నంగా చెప్పారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు రాజకీయాలు వద్దులే అని ఆర్ఎంఎం ప్రతినిధుల సమావేశంలో రజనీకాంత్ అన్నట్లు తెలిసింది. అంతకు ముందు ఆయన సమావేశ మందిరానికి రాగానే `రాజకీయాల్లోకి రావాలని, అందుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలి`అని అభిమానులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. బేజేపీకి వ్యతిరేకంగా నినాదలు చేయడంతో వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, పొత్తులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని. అభిమానులు తొందర పడవద్దని చెప్పారు. అయితే ఆ చర్చలు, పొత్తు ఎవరితోనే స్ఫష్టత లేదని అభిమానులు, అనుయాయులుఅంటున్నారు.
మీకైతేనే మద్దతు
రజనీ రాజకీయల్లోకి వస్తే ఆయనకే ఓట్లేస్తామని అభిమానులు నినాదాలు చేశారు. అందుకు భిన్నంగా ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తామంటే ఒప్పకునేదది లేదని చెప్పారు. దేవుడు ఆశీర్వదిస్తే రాజకీయాల్లోకి వస్తానని సుమారు నాలుగేళ్ల క్రితం చెప్పిన తమ అభిమాన నటుడు దానిపై ఇంతవరకూ స్పష్టత ఇవ్వకపోవడం నిరాశ, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచించుకుంటుండగా రజనీ మౌనం అర్థం కావడంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈరోజు ఒక ప్రకటన వెలువడి ఆయన పుట్టినరోజు (డిసెంబరు 12)న పార్టీ నిర్మాణం లాంటి కార్యాచరణకు దిగుతారని జోరుగా ప్రచారమైంది.