Wednesday, January 22, 2025

రజనీ బర్త్ డే స్పెషల్

• మూడక్షరాలతో సంచలనాలు
• ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు
• ట్విట్టర్ లో శుభాకాంక్షల వెల్లువ

ఆయన ఏం చేసినా సంచలనమే. నవ్వులో వైవిధ్యం, నడకలో వేగం, గోంతులో గాంభీర్యం, డైలాగులో ధీరత్వం, ఆయనే తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్. స్వయం కృషితో హీరోగా ఎదిగి దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న మేటి నటుడు రజనీ కాంత్. మూడు అక్షరాల ఆయన పేరు చెబితే ఆశేష ప్రేక్షక లోకం తన్మయత్వంతో ఊగిపోతుంది. ప్రత్యేక మైన పంచ్ డైలాగులు విసురుతూ అశేష జనవాహినితో నీరాలజనాలు అందుకుంటున్నారు. సూపర్ స్టార్ అన్న పదానికి అసలైన నిర్వచనం చెప్పిన రజనీ కాంత్. స్టైల్లో ఆయన మించిన వారు లేరు. రజనీ కాంత్ అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఆయన ఉద్యోగ రీత్యా కర్ణాటకకు చేరారు. 1973 లో బెంగళూరు ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లో కండక్టరుగా ఉద్యోగం ప్రారంభించారు. నటనపై రజనీకి ఉన్న ఆసక్తి, స్నేహితుల ప్రోత్సాహం కారణంగా సినిమారంగం వైపు పయనమయ్యారు. బాల చందర్ సినిమా అపూర్వ రాగంగళ్ తో తొలిసారిగా తెరపై కనిపించారు. తొలి సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అప్పటి నుండి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను భారతీయ ప్రేక్షకులకు అందిస్తూ తన నటనతో మెప్పిస్తూ వస్తున్నారు. కండక్టరుగా మొదలైన ఆయన జీవిత ప్రస్థానం మేటి నటుడిగా దేశం గర్వంచ దగ్గ స్థాయికి ఎదిగారు.

వెల్లువలా శుభాకాంక్షలు:
70 వ వసంతంలోకి అడుగు పెట్టిన రజనీకాంత్ కు పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రజనీ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రధాని అకాంక్ష వెలిబుచ్చారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేయడంతో రాజకీయనేతలు కూడా రజనీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బర్త్ డే విషెస్ తెలిపారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగా స్టార్ చిరంజీవి రజనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లోనూ రజనీ సూపర్ స్టార్ గా వెలుగొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు పోస్ట్ చేశారు. రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా ప్రజలకు సేవ చేయడానికి మరింత శక్తితో ముందుకు సాగాలి అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుబాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదీ చదవండి :రజినీ పార్టీ పెడతారు…

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ 70 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు సినీనటుడుగా కోట్లాది ప్రేక్షకులను అలరించిన రజనీ కాంత్ కు ఈ బర్త్ డే ప్రత్యేకమనే చెప్పాలి. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ఇటీవలే ప్రకటించడంతో ఇప్పటి నుంచి రాజకీయ నాయకుడిగా కీర్తిస్తూ ఆయన అభిమానులు వేడుకలు జరుపుతున్నారు. సినీ రంగంలో తన డైలాగులు, యాక్షన్ తో అశేష ప్రేక్షకులను అలరించిన రజనీ ఇపుడు రాజకీయాల్లో సరికొత్త పాత్రను పోషించబోతున్నారు.

ఇదీ చదవండి :‘రజని’ రాజకీయంలో అదే సస్పెన్స్

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles