గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు రాజాసింగ్ కు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2016లో ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలతో కలిసి యూనివర్శిటీకి వెళ్ళిన రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రాజాసింగ్ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కేసు నమోదు చేశారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఘటనలో కోర్టు తీర్పు వెల్లడించింది. ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునివ్వడంతో బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై అప్పీలు చేసుకునేందుకు నాంపల్లి కోర్టు నెలరోజుల గడువు విధించింది.