వోలేటి దివాకర్
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ..మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వయం కృషితో అప్పటి వరకు పోలీసు సబ్ డివిజన్ గా ఉన్న రాజమహేద్రవరం 2009లో పోలీస్ అర్బన్ జిల్లా స్థాయికి ఎదిగింది. ఆ తరువాత అర్బన్ జిల్లాను జగ్గంపేట వరకు విస్తరించాలని ప్రతిపాదనలు చేసినా ఆచరణలోకి రాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయడంతో కొత్తగా కోనసీమ పోలీసు జిల్లా ఏర్పాటు అయ్యింది. అయితే అర్బన్ జిల్లాగా ఉన్న రాజమహేద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి పోలీసు జిల్లాగా ఆవిర్భవించింది. రాజమహేద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఉభయ గోదావరి జిల్లాలోని అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 32 పోలీసు స్టేషన్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పరిధిలోకి తెచ్చారు.
కొత్త స్వరూపం ఇదే!
అర్బన్ జిల్లా ఏర్పడిన 13 ఏళ్ల తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడిన సుమారు మూడు నెలల తరువాత శనివారం రాత్రి జీవో జారీ అయ్యింది. దీని ప్రకారం కొత్తగా దేవరపల్లి పోలీస్ సర్కిల్ ఏర్పడింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ పరిధిలోకి వన్ టౌన్, త్రీటౌన్, ప్రకాష్ నగర్ పోలీసులు స్టేషన్లు వచ్చాయి. సౌత్ జోన్ పరిధిలోకి టూటౌన్, ధవళేశ్వరం, కడియం, ఈస్ట్ జోన్ పరిధిలోకి అనపర్తి, బొమ్మూరు, బిక్కవోలు, రంగంపేట పోలీస్ స్టేషన్లు వచ్చాయి.
నార్త్ జోన్ పరిధిలోకి రాజానగరం, కోరుకొండ, సీతానగరం, ఎయిర్ పోర్టు,గోకవరం పీఎస్ వచ్చాయి.
కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలోకి కొవ్వూరు,నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి సర్కిళ్లు చేర్చారు.
రాజమహేంద్రవరంలోని దిశ స్టేషన్, సీసీఎస్ జిల్లా పరిధిలోనే ఉండగా, సౌత్ సీసీఎస్, ఈస్ట్, నార్త్ సీసీఎస్ లు రాజమహేంద్రవరం క్రైమ్ డివిజన్లో ఉంటాయి. ట్రాఫిక్ ప్రత్యేక సబ్ డివిజన్ గా ఉంటుంది.
ఇక నుంచి తాజా న్యూస్ కోసం ఈ డ్రీమ్స్ ఎంచు కొంటాం.. సర్