————————–
(‘SCEPTRE’ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
38. సంచారి తత్త్వాలు
————————–
ఒక రాజు తన భార్యతో అన్నాడు.” మేడం, నీవు నిజంగా రాణివి కావు. నీవొక అసభ్యకరమైన, దయలేని స్త్రీవి. నీవు నా సహచరిగా ఉండడానికి పనికిరావు!”
ఆ భార్య అంది ” సర్, నీకు నువ్వే రాజుగా భావిస్తున్నావు. నిజానికి నీవొక పనికి రాని మాటల పోగువి. “
ఆ మాటలు రాజుకి కోపం తెప్పించాయి. రాజు తన బంగారు రాజ దండం తీసుకొని రాణి నుదుటి మీద దెబ్బ వేసాడు.
అదే సమయంలో లార్డ్ చాంబర్లేన్ ప్రవేశించాడు. ఆయన ఇట్లా అన్నాడు. “ఘనత వహించిన రాజా! ఆ రాజ దండము ఒక గొప్ప కళాకారుడిచే రూపొందించబడింది. కొంత కాలం తరువాత మీరూ, రాణీ గారూ జ్ఞాపకాల్లో మరుగున పడి పోతారు. కానీ, ఆ రాజ దండం తరాల తరబడి ఒక సౌందర్య వస్తువుగా ఉంచబడుతుంది. ఇప్పుడు మీరు , ఘనత వహించిన రాణి గారి శిరస్సు నుండి రక్తం బయటకు రప్పించారు కాబట్టి — ఆ రాజ దండము ఇంకా ఎక్కువగా ప్రజల జ్ఞాపకాల్లో ఉంటుంది.”
Also read: అన్వేషణ
Also read: నేరమూ, శిక్షా
Also read: చెెవిటి భార్య
Also read: ఒక దేవుడు మరియు చాలా మంది దేవుళ్ళు
Also read: ఆవాసాలు