కేసిఆర్ అధికార ఉన్మాది గా మారి రాష్ట్రన్ని దోచుకుంటున్నారని పిసిసీ ఛీప్ రేవంత్ రెడ్డి మరో సారి అరోపించారు.బియ్యం మాయమైన ఘటన పై సిబిఐ విచారణ జరిపించాలనా డిమాండ్ చేశారు.
కేసిఆర్ అవినీతిని ఎండ గట్టడానికే రాహుల్ గాంధీ రాష్ట్రని వస్తున్నారని చేప్పారు. ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందన్నారు. తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యిందన్నారు. మే 6, 7 తేదీల్లో తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారని . మే 6న వరంగల్‌లో రాహుల్‌గాంధీ బహిరంగ సభ ఉంటుందని చేప్పారు. మే 7న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో రాహుల్ సమావేశం కానున్నాట్లు తెలిపారు. ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో 8వేల మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారని అవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ ఏర్పాటు తర్వాత 82 వేల మంది రైతులు చని పోయినట్లు ప్రభుత్వం రైతు భీమా ప్రకటనలు ఇచ్చిందని గుర్తు చేశారు.కేసిఆర్ మెడలు వంచి వరి కొనిపిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేని రేవంత్ అన్నారు.పంట వేయక కొందరు, పంట ను తక్కువ ధరకు అమ్ముకుని కొందరు రైతులు నష్టపోయారని,పంట వేయక నష్టపోయిన రైతులకు ఎకరానికి 15వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు ఆరు వందల బోనస్ ఇవ్వాలన్నారు మిల్లర్లు, ప్రభుత్వం కలిసి 3 వేల కోట్ల కుంభకోణం చేశాయని అరోపించారు. ఎఫ్ సి ఐ కి చెందిన బియ్యం మాయమయ్యాయి. అందుకే సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిజాంకు పట్టిన గతే కేసిఆర్ కు పడుతుంది హెచ్చిరించారు.ఖమ్మం మంత్రి పువ్వాడ అజయ్ వొళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.ఆయన అరాచకాలు పెట్రేగి పోయాయిని అయన్ని ఇంట్లో దూరి కొట్టే రోజులు వస్తాయన్నారు.తమ కార్యకర్తల మీద కేసులు పెట్టి శునకానందం పొందుతున్నారని అన్నారు.