Sunday, December 22, 2024

భరణి సినిమాలో దర్శకేంద్రుడు

నటులు దర్శకులు కావడం, దర్శకులు నటులు కావడం, ఆ రెండు పాత్రలను ఏకకాలంలో సమర్థంగా పోషించి శభాష్ అనిపించుకోవడం కొత్త కాదు. కానీ శత చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావు విషయాన్ని ప్రత్యేకంగానే చెప్పుకుంటారు. ఆయన సభావేదికలపైనే మాట్లాడేవారు కాదు. తప్పదనుకుంటే ముక్తసరిగా మూడే మూడు మాటల్లో ముగించే వారు. అలాంటాయన `మౌనం వీడారు`అంటూ ఒక చానల్  ఆయన సినీ అనుభవాలతో వారం వారం ధారావాహిక  ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.

విషయానికి వస్తే  నటుడు, రచయిత భరణి రూపొందించే చిత్రంలో నటించనున్నారట. ఆ సినిమా గురించి వచ్చే ఫిబ్రవరిలో అధికారికంగా ప్రకటిస్తానని భరణి తెలిపారు. మరి దర్శకేంద్రుని పాత్ర ఎలాంటిదో వేచి చూడాలి. రమ్యకృష్ణ,  శ్రియ, సమంత కూడా ఈ సినిమాలో నటిస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles