తనిఖీల్లో వెల్లడి
వోలేటి దివాకర్
ఉమ్మడితూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం మాంసం దుకాణాల్లో తూనికలు, కొలతలు, విజిలెన్స్ శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా సగానికి పైగా దుకాణాల్లోని తూనికల్లో తేడాలు కనిపించాయి. ఈ తేడాలు ఏకంగా కిలోకు పావు కిలో వరకూ ఉండటం గమనార్హం. మాంసం దుకణాల్లోనే కాదు ఈపరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా అన్ని దుకాణాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి.
కొవ్వూరు పట్టణంలో 12 చికెన్, మటన్ ,చేపల షాపులలో తనిఖీలు నిర్వహించి 4 షాపులలో ఒక్క కేజీకి సుమారు 50 గ్రాములు వరకు ఎక్కువ , 2 షాపులలో ఒక్క కేజీకి సుమారు 100 గ్రాములు మరో రెండు షాపులలో ఒక్క కేజీకి సుమారు 200 గ్రాములు తేడాలు గుర్తించారు. ఒక అయితే షాపు ఒక్క కేజీకి సుమారు 250 గ్రాములు వరకు తక్కువ తూగింది. దీంతో మొత్తం 10 షాపులపై కేసులు నమోదు చేశారు.
కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండలంలో 9 చికెన్, మటన్ , చేపల షాపు లలో తనిఖీలు నిర్వహించి 1 (ఒక్క) షాపులో ఒక్క కేజీకి సుమారు 100 గ్రాములు వరకు తక్కువగా తూకం ఉన్నట్లు గుర్తించారు.
7 షాపులలో ఎలక్ట్రానిక్ కాటాలకు స్టాంపింగ్ లేకపోవుట గుర్తించిన లీగల్ మెట్రాలజీ అధికారులు మొత్తం 8 కేసులు నమోదు చేశారు
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం మండలంలో 14 చికెన్, మటన్, చేపల షాపు లలో తనిఖీలు నిర్వహించి 7 ఎలక్ట్రానిక్ కాటాలకు స్టాంపింగ్ లేకపోవడాన్ని గుర్తించిన లీగల్ మెట్రాలజీ అధికారులు కేసులు నమోదు చేశారు.కోనసీమ వ్యాపారులు కొంత న్యాయంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వ్యాపారులు ముందుగానే ఎక్కువ బరువును నమోదు చేసి ప్రజలను మోసం చేస్తున్నట్లు ఈతనిఖీల్లో వెల్లడైంది.