• శ్రీలంక నుంచి చెన్నైకి రానున్నఇంగ్లండ్ టీమ్
• ఫిబ్రవరి 5 నుంచి భారత్- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్
భారత్ లో నెలన్నర పాటు జరగనున్న పర్యటనకు శ్రీలంక నుంచి చెన్నైకి చేరుకోనున్న ఇంగ్లండ్ క్రికెటర్లకు ఆరురోజుల క్వారెంటెన్ లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే జనవరి 27న భారత గడ్డపై ఇంగ్లండ్ జట్టు అడుగుపెట్టనుంది. జనవరి 27 నుంచి ఇంగ్లండ్ క్రికెటర్లు ఆరురోజులపాటు క్వారెంటెన్ లో ఉంటారని, ఆ తర్వాత కేవలం ఐదురోజులపాటు మాత్రమే సాధన చేయటానికి సమయం ఉంటుందని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
భారత్ తో భారీసిరీస్:
ఇంగ్లండ్ జట్టు తన భారత పర్యటన కాలంలో ముందుగా నాలుగు మ్యాచ్ ల ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ లీగ్ సమరంలో తలపడనుంది. జనవరి 5 నుంచి ఐదురోజులపాటు చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా తొలిటెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. జనవరి 17 నుంచి రెండోటెస్ట్ మ్యాచ్ ను సైతం చెపాక్ స్టేడియం వేదికగానే నిర్వహిస్తారు. సిరీస్ లోని ఆఖరి రెండుటెస్టు మ్యాచ్ లను అహ్మదాబాద్ వేదికగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్, మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఐసీసీ టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ నంబర్ వన్ జట్టుగా ఉంటే ఇంగ్లండ్ 4వ ర్యాంక్ జట్టుగా కొనసాగుతోంది. జో రూట్ నాయకత్వంలో పవర్ ఫుల్ ఇంగ్లండ్ జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారతజట్టు సవాలు విసురుతోంది. చెన్నై వేదికగా జరిగే మొదటిరెండు టెస్టు మ్యాచ్ లను స్టేడియం గేట్లు మూసి ఖాళీ స్టేడియంలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఇది చదవండి: ఛతేశ్వర్ పుజారా:బర్త్ డే స్పెషల్
ఇదీ ఇంగ్లండ్ జట్టు టూర్ ప్రోగ్రాం:
ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఫిబ్రవరి 5న చెన్నై, అహ్మదాబాద్ వేదికలుగా ప్రారంభం కానుంది. చెన్నైలో రెండు జట్ల మధ్య తొలి రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మూడో టెస్టు(డే అండ్ నైట్), నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది.
తొలి టెస్టు: ఫిబ్రవరి 5-9 వరకూ చెన్నై వేదికగా తొలిటెస్ట్ సమరం
ఫిబ్రవరి 13-17 వరకూ చెన్నై వేదికగా రెండో టెస్టు
ఫిబ్రవరి 24-28 వరకూ అహ్మదాబాద్ వేదికగా మూడో టెస్టు(డే/నైట్)
మార్చి 4-8, అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు
ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్:
భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇక ఇక్కడ కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియంలో మొత్తంగా ఏడు అంతర్జాతీయ మ్యాచ్(2 టెస్టులు, 5 టీ20)లు జరుగనున్నాయి.
తొలి టీ20: మార్చి 12, రాత్రి 7 గంటలకు
రెండో టీ20: మార్చి 14
మూడో టీ20: మార్చి 16
నాలుగో టీ20: మార్చి 18
ఐదో టీ20: మార్చి 20
ఇది చదవండి: భారత్ కు ఇంగ్లండ్ పేస్ సవాల్
పూణే వేదికగా వన్డే సిరీస్:
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌కు పుణె వేదిక కానుంది.
తొలి వన్డే: మార్చి 23 (మధ్యాహ్నం 1.30 నిమిషాలు)
రెండో వన్డే: మార్చి 26
మూడో వన్డే: మార్చి 28
మార్చి 29న ముంబయి నుంచి ఇంగ్లండ్ జట్టు స్వదేశానికి బయలుదేరుతుంది.
ఇది చదవండి: ఇంగ్లండ్ తో సిరీస్ కు కొహ్లీ, పాండ్యా, ఇశాంత్