Friday, November 8, 2024

గ్రేటర్ ‘సుడి’లో తెలుగు తేజాలు

(డా. ఆరవల్లి జగన్నాథస్వామి)

తెలుగవారి కీర్తిని దశదిశలా వ్యాపింప చేసిన పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు ఇఫ్పుడు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల  ప్రచారంలో వార్తల్లో వ్యక్తులయ్యారు. అది వారిని స్ఫూర్తిగా తీసుకోవడం  కంటే వారి అస్తిత్వానికే భంగం కలిగేలా ఉండడం పార్టీలకు అతీతంగా అభిమానులను కలచివేస్తోంది. ఈ విషయంలో ఆయా పక్షాల ఆరోపణ ప్రత్యారోపణలు `తమల పాకుతో ఒకటిస్తే తలుపుచెక్కతో రెండిస్తా` అనేలా తయారైంది. హైదరాబాద్ లో ఆక్రమణలు తొలగించాలనుకుంటే మాజీ  ప్రధాని పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  ఎన్టీ రామారావు సమాధుల  నుంచే ప్రారంభం కావాలని, ట్యాంక్ బండ్ పై గల విగ్రహాలను తొలగించాలన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ స్పందిస్తూ, ఎంఐఎం నాయకుడికి దమ్ముంటే  ఆ పనిచేయాలని,  ఆ వెంటనే రెండు గంటల్లో దారుసలాంను కూల్చేందుకు  తమ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా  ఉన్నారని   హెచ్చరించారు.

వారిద్దరి సవాళ్లు  ప్రతిసవాళ్లు అలా ఉంటే,  టీఆర్ఎస్,కాంగ్రెస్ నేతలు బండి  సంజయ్ పై ఎదురుదాడికి దిగారు. ఆ ఇద్దరు నేతల పట్ల  బీజేపీకి ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే  వారికి భారతరత్న ప్రకటించాలని  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  డిమాండ్ చేశారు. బండి సంజయ్ పీవీ సమాధి దగ్గర రాజకీయ నాటకాలు ఆడుతున్నారని కవిత విమర్శించారు. రాష్ట్ర  ప్రభుత్వం  పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తుండగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒక్క రోజు కూడా ఆయన గురించి మాట్లాడలేదని, జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే ఒక పార్టీ పీవీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, మరోపార్టీ దాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పీవీకి, ఎన్టీఆర్ కు  భారతరత్న ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

విద్వేషాలు రెచ్చగొడితే సహించం: ఢీజీపీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో కొందరు  నాయకుల వ్యాఖ్యలు  మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, అలాంటి వారి ప్రసంగాలను పరిశీలిస్తు న్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహ రిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని గురువారం చెప్పారు. నగరంలో గత ఆరేళ్లలో ఎలాంటి అశాంతి వాతావరణం లేదని, కానీ ఇప్పుడు కొందరు విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారనే సమాచారం తమ వద్ద ఉందని ఆయన వివరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించేందుకు పోలీసు బృందాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

Also Read: ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యలు

సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని, అందుకోసం సోషల్ మీడియా పోస్టులపై నిఘా ఉంచామని డీజీపీ తెలిపారు

బీజేపీ ఎంపీ తేజస్విపై కేసు

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై   బీజేపీ ఎంపీ (బెంగళూరు) తేజస్వి సూర్య కేసు నమోదు చేసినట్టు డీజీపీ తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీ రిజిస్ట్రార్  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

గౌడ్

తెలంగాణ రాష్ట్ర సమితిలో వలస నాయకులకు ఉన్నప్రాధాన్యం,మొదట నుంచి పార్టీని నమ్ముకున్న వారి లేదని శాసనమండలి  మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఆరోపించారు. ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వారికి పదవులు కట్టబెట్టారని, పార్టీల నుంచి తీసుకోవడం బాగాలేదని అన్నారు. కొందరు టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ అనుయాయులు అంటున్నట్లు .తాను  రోడ్డు మీద ఖాళీగా ఉంటే తెచ్చి  ఆ పదవి ఇవ్వలేదని,తెలంగాణ ఉద్యమంలో తాను కీలక పాత్ర పోషించానని చెప్పారు.

ఆత్మాభిమానం చంపుకొన టీఆర్ఎస్ లో ఇమడలేకే బీజీపీలో చేరాను తప్ప  పదవుల కోసం కాదని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును తండ్రిలా భావించానని,అయితే, చెప్పుడు మాటలు విని తనను పక్కన పెట్టారని అన్నారు.మాట్లాడేందుకు  రెండు నిమిషాల  సమయం  కూడా   తనకు ఇవ్వలేదని  గురువారం అన్నారు. పోలీసులు తనను చంపడానికి రెండుసార్లు ప్రయత్నించారని స్వామిగౌడ్  సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: గ్రేట‌ర్‌లో గెలుపెవ‌రిది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles