- సంక్షోభంలో కాంగ్రెస్ సర్కార్
- పావులు కదుపుతున్న బీజేపీ
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు ఉదయం అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. పుదుచ్చేరి రాజ్ భవన్ లో తమిళసై చేత మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళిసై ప్రమాణ స్వీకారానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి హాజరయ్యారు. ఎల్జీగా బాధ్యతలు చేపట్టడానికి నిన్న రాత్రి పుదుచ్చేరి చేరుకున్న తెలంగాణ గవర్నర్ కు సీఎం నారాయణ స్వామి స్వాగతం పలికారు.
Also Read: పుదుచ్ఛేరి గవర్నర్ గా కిరణ్ బేదీ తొలగింపు
ఎమ్మెల్యేల రాజీనామాతో అనూహ్య మలుపులు:
లెఫ్ట్ నెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌బేడీని తొలగిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల (ఫిబ్రవరి)16న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడతంతో సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున అక్కడ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. పుదుచ్చేరిలో ఈసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: పుదుచ్ఛేరిలో పావులు కదుపుతున్న బీజేపీ