* ఇసుక రిచ్ వద్ద ధర్నా
మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం వెలాల జాతరకు వచ్చిన సంకే శ్రీనివాస్ గోదారిలో పుణ్యస్నానాలు చేస్తున్న క్రమంలో ఇసుక రిచ్ కాంట్రాక్టర్,జాతర నిర్వాహకుల నిర్లక్ష్యం మూలంగా ఇసుక రిచ్ నీటి మడుగులోకి జారిపోయి మరణించడం జరిగింది.
ఘటన జరిగి 18 రోజులు గడిచిపోయిన ఈ రోజు వరకు బాధిత కుటుంబాన్ని అదుకొక పోవడం దుర్మార్గం. బాధ్యులైన కాంట్రాక్టర్ పై, నిర్వాహకులపై చర్యలు తీసుకోని బాధిత కుటుంబన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వెలాల ఇసుక రిచ్ వద్ద బాధిత కుటుంబ సభ్యులు, ప్రజ ప్రతినిదులు,సామాజిక, కార్మిక సంఘాలు బుధవారం లారీలను అడ్డుకొని ధర్నా చెయ్యడం జరిగింది.స్థానిక జైపూర్ SI జ్యొక్యం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ధర్నా విరమింప చెయ్యడం జరిగింది.
అనంతరం నాయకులు మాట్లాడుతు కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా బారీ లోతుతొ జెసిపి పెట్టి ఇసుకను తియ్యడంతో భారీ గుంతలేర్పడం జరిగింది.మల్లన్న సాగర్ పేరుతో కాంట్రాక్టర్ ఇసుకను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించడం జరుగుతుంది. బాధిత కుటుంబానికి న్యాయం జరగకుంటే పెద్ద ఎత్తున ఇసుక రిచ్ వద్ద ఆందోళన చెయ్యడం జరుగుతుంది.
పాల్గొన్నవారు సాపాట్ శంకర్ సర్పంచ్ సోమగుడెం (కే) BC మోర్చజిల్లా కార్యదర్శి డేగ నగేష్,
సుందిల్ల మల్లేష్ MRPS, గోడిసెల చంద్ర మొగిలి KVPS జిల్లా అధ్యక్షుడు, సంకే రవి CPM జిల్లా కార్యదర్శి, CITU బాలకినాయకులు ఎస్.వెంకటస్వామి, కుమారి కనుకుల రాకేష్ ఉప సర్పంచ్ సోమాగుడెం(కే) ఎస్ సి, ఎస్టీ ఎంఫ్లాయిస్ సంఘం నాయకులు కనుకుల తిరుపతి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.