విన సొంపైన శబ్దాలతో కూర్చిన మధురమైన భాష తెలుగు
పదాల చివర హల్లులు లేని అపురూపమైన భాష
పాశ్యాత్యులు ఇటాలియన్ భాషతో పోల్చిన భాష
లలితంగా, సరళంగా సెలయేటి గలగలల్లా జాలువారే భాష
కష్టంగా పలికే, కఠోరంగా వినిపించే శబ్దాలు లేని భాష
ప్రతి శబ్దానికి ప్రత్యేక అక్షరం కలిగిన భాష.
ఎక్కువ అక్షరాలతో శబ్దాలను స్పష్టంగా పలికించే భాష
అపార్ధాలకు తావివ్వని స్వచ్ఛమైన భాష
పలు ప్రక్రియల్లో భావ ప్రకటనకు అనువైన భాష.
అశేష సాహిత్య చరిత్ర గల భాష.
ఎందరో మహానుభావులు పరిపుష్టం చేసిన భాష.
పద్య, వచన కవిత్వాల్లోనూ వ్యక్తీకరణ కుంటు పడనివ్వని భాష
కళామ తల్లి ప్రియ తనయ మన తెలుగు భాష.
కాసేపు వసంతాన్ని, కోయిలను పక్కన పెట్టి
నేటి తెలుగు భాష దుస్థితి చూద్దాం
ఆంగ్లభాషా వ్యామోహం అమ్మను మరచిపోయేలా చేస్తున్నది
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుగుకు తెగులు పట్టించారు
కళ్ళు, కల్లు తేడా తెలియని నవతరం
తెలుగు తల్లి గుండెల్లో శూలం గుచ్చుతూంది
విడిపోయిన తెలంగాణ తమ్ముడు
తన ప్రాంత తెలుగును అద్భుతంగా ప్రోత్సహిస్తున్నాడు
ఆ సుడిగాలి తాకిడికి ఆంధ్ర తెలుగు దీపం ఆరిపోతుందేమో
భాషను కాపాడుకోవడం మన కవుల ప్రాధమిక బాధ్యత కదా.
Also read: “రాగ భంగం”
Also read: “త్రిలింగ దేశంలో హత్య”