తెలంగాణ రాష్ట్ర రాజధాని నగర ప్రాంతంలో హైదరాబాద్ నిజాం సుమారు 150 సంవత్సరాల కిందట 1874లో నిర్మించిన పురాతన సికింద్రాబాదు రైల్వే స్టేషనుకు గొప్ప చారిత్రక, వారసత్వ ప్రాముఖ్యతతో పాటు భారతదేశం లోని అన్ని ప్రాంతాల నుంచీ, విదేశాల నుంచీ కూడా ప్రయాణీకులకు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్న ఘనచరిత్ర ఉంది.
బ్రిటిష్ కాలం నాటి సికింద్రాబాదు రైల్వే స్టేషను మెయిన్ కాంప్లెక్స్ ను ఒక ఆధునిక స్టేషనుగా, అత్యాధునిక రైలు హబ్ గా మారుస్తూ ఇటీవల చేసిన ప్రకటనపై స్పందిస్తూ హైదరాబాద్ నగరంలో గొప్ప చారిత్రాత్మక, వారసత్వ ప్రాముఖ్యతను కలిగి ఉన్న చారిత్రాత్మక రైల్వే స్టేషన్ మెయిన్ బిల్డింగ్ యొక్క అత్యంత ప్రధానమైన రూపురేఖలకు భంగం కలగకుండా ఇమేజిబిలిటీని పరిరక్షించాలని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ విజ్ఞప్తి చేసింది.
ఈ వారసత్వ భవనాన్ని కాపాడడానికి, పరిరక్షించడానికి, ఆధునీకరణ ప్రక్రియలో భవనపు వారసత్వ విలువలకు, రూపురేఖలకు హాని కలిగించకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యల గురించి జిహెచ్ఎంసి ప్రాంతంలోని “వారసత్వ భవనాలు మరియు ఆవరణల రక్షణ” కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రేటర్ హైదరాబాద్ హెరిటేజ్ అండ్ ప్రిసింక్ట్స్ కమిటీ, జిహెచ్ఎంసి (GHHPC) ను సంప్రదించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఫోరం కోరుతున్నట్టు ఫోరం చైర్మన్ మణికొండ వేదకుమార్ విజ్ఞప్తి చేశారు.
పురపాలక శాఖ మంత్రి శ్రీ కె.టి.రామారావు గారు తలపెట్టిన విధంగా హైదరాబాద్ కు ప్రపంచ వారసత్వ నగర హోదాను పొందడానికి కారకమైన హైదరాబాద్ లో ఇలాంటి ఘనమైన వారసత్వ సంపదను పరిరక్షించడానికి పైన పేర్కొన్న విషయాన్ని సమీక్షించవలసిందిగా ఛైర్మన్ , తెలంగాణ స్టేట్ హెరిటేజ్ అథారిటీ (టిఎస్ హెచ్ ఎ), ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మునిసిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి (MA&UD) గారిని కూడా ఫోరం కోరింది. దక్షిణ మధ్య రైల్వే పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తుందన్న విశ్వాసాన్ని ఫోరం వెలిబుచ్చింది. ఈ మేరకు జనరల్ మేనేజర్, దక్షిణ రైల్వేస్, గ్రేటర్ హైదరాబాద్ హెరిటేజ్ అండ్ ప్రిసిండెంట్స్ కమిటీ చైర్మన్,), జీహెచ్ఎంసీ (GHHPC), తెలంగాణ స్టేట్ హెరిటేజ్ అథారిటీ(TSHA), స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మునిసిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి (MA&UD), జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితర సంస్థలకు ఫోరం లేఖలను పంపిందని వేదకుమార్ (మొబైల్ 9848044713, email: [email protected]) ఒక ప్రకటనలో తెలిపారు.