తిరుపతి, మార్చి 11: ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి రామాలయం పక్కన పడివున్న “పల్లవప్రశస్తి”శాసన బండను పరిరక్షించాలని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మోటువల్లి రామాలయం, వీరభద్ర స్వామి సన్నిధి పరిసరాల్లోని శాసనాలను ఆయన పరిశీలించారు. రామాలయం పక్కనున్న శాసనంలోని అంశాలను చదివి. దానిని క్రీ.శ. 1231 నాటి ముక్కంటి పల్లవప్రశస్తి శాసనంగా నిర్ధారించారు. ఇప్పటిదాకా ఆ శాసనాన్ని కాకతీయ గణపతి దేవుని శాసనంగా భావించారు. బ్రిటిష్ అధికారులు గణపతి దేవుని శాసనంగానే పరిగణించారు. గణపతి దేవుని 1244 సం॥ నాటి శాసనం వీరభద్రాలయంలో వుందని ఆయన తెలిపారు.
రామాలయంగా ప్రసిద్ధి పొందిన మందిరం ఒకనాడు. గణపతి ప్రసన్న చెన్నకేశవ గుడి. చెన్నకేశవగుడికి భూదానం చేసిన సందర్భంగా రాసినదే. ఆ శాసనం శాసన బండకు గల సందర్భంగా నాలుగు ముఖాల్లోనూ శాసనాలున్నాయి. మొదటి ముఖంలో ‘పల్లవ కుల తిలక’ మలిదేవ మహారాజు కుమారుడు సిద్ధమ దేవమహారాజు చేసిన భూదానం గురించి పేర్కొన్నారని
మైనాస్వామి వివరించారు. శాసనంలో తెలుగు భాష అద్భుతంగా వుందని, అటువంటి శాసనం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూండడం బాధాకరమని చారిత్రక పరిశోధకుడు ఆవేదన వ్యక్తం చేశారు. మోటు పల్లి పల్లవ ప్రశస్తి శాసన పరిరక్షణకు తక్షణం చర్యలు. చేపట్టాలని ఆయన కోరారు. ఔత్సాహిక పరిశోధకుడు కావలి సనత్ కుమార్ రెడ్డి మైనాస్వామి వెంటవున్నారు.