———–
( ‘ PRAYER ‘ FROM ‘ THE PROPHET ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
————–
అప్పుడు ఓ అర్చకురాలు ” మాకు ప్రార్థన గురించి చెప్పండి” అని అడిగింది.
ఆల్ ముస్తఫా ఇలా చెప్పసాగాడు:
మీరు మీ బాధలోనూ, అవసరం లోనూ ప్రార్థిస్తారు;
అలాగే, అమితానందంగా ఉన్నపుడు,
జీవనం సుసంపన్నంగా ఉన్నపుడు
— కూడా ప్రార్థించండి!
జీవితాకాశంలో మీ ఆత్మను
విశాలం చేసుకోవడం తప్ప
ప్రార్థన అంటే ఇంకేముంటుంది?
మీ సుఖం కోసం
మీ చీకట్లను శూన్యంలో ఎలా వదులుతారో
మీ ఆనందం కోసం
మీ హృదయాల వేకువలని అలానే కురిపిం చండి!
మీ ఆత్మ —
ప్రార్థనకు మిమ్ములను ఆదేశించినప్పుడు
మీరు దుఃఖం నుండి బయట పడక పోతే
మీరు నవ్వుతూ వచ్చేవరకు —
మిమ్ములను ప్రోత్సహిస్తూనే ఉంటుంది!
మీరు ప్రార్థిస్తూ ఉంటే —
అదే సమయంలో ప్రార్థించే వారిని
ఎత్తుకు ఎగిరి ఆకసంలో కలుసుకో గలరు
వారిని మామూలుగా మీరు కలిసే అవకాశం రాదు!
అదృశ్య ఆలయ సందర్శన
ఒక పారవశ్యం గానూ,
ఒక మధుర జ్ఞాపకం గాను ఉండిపోనీండి!
ఎందుకంటే —
కోరికలు కోరేందుకే ఆలయానికి వెళ్ళినట్లయితే
మీరు ఏమీ పొందరు:
వినమ్రతతో వెళ్ళినా
మీరు ఉన్నతి పొందరు:
మీరు ఇతరుల మంచికోసం
ప్రార్ధించడానికి వెళ్లినా గానీ,
మీ మాటలు వినిపించుకో బడవు!
ఆలయ సందర్శన
అదృశ్యంగా ఉండడమే ఉత్తమం!
మాటల్లో ప్రార్ధించడం నేను మీకు నేర్ప లేను!
దైవం మీ పెదాల ద్వారా
పలుకుతున్నప్పుడు తప్ప
మీ మాటలను వినడు!
సాగరాల, వనాల, పర్వతశ్రేణుల
ప్రార్థనను నేను మీకు నేర్ప లేను
పర్వతాలు, వనాలు, సాగరాల నుండి
జనించిన మీరు — వాటి ప్రార్థనను
మీ మనసుల్లో చూసుకోగలరు!
కాని, నిశ్చల నిశీధిలో
మీరు వినగలిగితే —
అవి నిశ్శబ్దంగా ఇలా చెబుతాయి:
“భగవాన్! మీరు రెక్కలున్న మా ఆత్మయే
మా లోని ఆకాంక్ష మీ ఆకాంక్షయే
మా లోని కోరికలు మీ కోరిక లే!
నిజానికి,
“నీవైన మా రాత్రులను
పగళ్లు చేయడానికి ( ఆ పగళ్లు కూడా మీవే!)
మమ్ములను పురిగొల్పేది
మీ కాంక్షయే కదా!
మా అవసరాలు — మా మనసుల్లో
పుట్టకముందే మీకు తెలుసును
అందుకే —
మిమ్ములను వేరే ఏమీ అడుగలేము:
“మీరు మా అవసరం
మిమ్ములను మీరు ఇచ్చుకుంటే
మాకు సర్వమూ ఇచ్చినట్లే కదా!”
Also read: నీడ
Also read: శాంతి ఒక అంటు వ్యాధి
Also read: మంచి — చెడు
Also read: కాలం
Also read: తిమింగలము — సీతాకోకచిలుక