బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గులాబ్ తుఫాన్ తో వాతావరణం శాఖ రెడ్ అలెర్ట్ జోన్ ప్రకటించింది. అందువల్ల వచ్చే 48 గంటలలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశము ఉంది. కావున అందరు విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు తెలిపారు.. ప్రజలందరూ విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని , విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని , విద్యుత్ వైర్లు తెగిన మరియు ఎటువంటి విద్యుత్ సంబంధిత సమస్య లకైనా సంబంధిత సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 18004250028, 1912 కి తెలియచేయాలని సీఎండీ కోరారు.