(‘POMEGRANATES’ FROM ‘ THE WANDERER’ BY KAHLIL GIBRAN)
తెలుగు సేత: డా. సి.బి. చంద్ర మోహన్
34. సంచారి తత్త్వాలు
————————
పూర్వం ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పళ్ళ తోటలో చాలా దానిమ్మ చెట్లు ఉండేవి. శరత్కాలాల్లో, తోటలోని దానిమ్మ పళ్ళు తన ఇంటి బయట వెండి పళ్లాలలో పెట్టి ఉంచేవాడు. ఆ వెండి పళ్లాల మీద తన స్వహస్తాలతో ఇలా వ్రాసి సంతకం చేసేవాడు. ” తప్పక ఒక పండు తీసుకోండి. ఇదే మీకు ఆహ్వానం.”
ప్రజలు అటు వైపుగా వెళ్లే వారు గానీ, ఎవ్వరూ పళ్ళు తీసుకోలేదు.
ఆ వ్యక్తి ఆలోచించాడు. ఒక శరత్కాలంలో ఇంటి బయట వెండి పళ్లాలలో దానిమ్మ పళ్ళు పెట్ట లేదు. కానీ, పెద్ద అక్షరాలతో , తన సంతకంతో ఒక లేఖ వ్రాసి పెట్టాడు. దానిలో ఇలా ఉంది. ” మా వద్ద ఈ పొలాల్లో పండిన వాటిలో కెల్లా శ్రేష్ఠ మైన దానిమ్మ పళ్ళు ఉన్నాయి. వాటిని మామూలు దానిమ్మ పళ్ళ కన్నా ఎక్కువ వెండి నాణాలకు అమ్ముతాం.”
ఇక చూడండి! ఆడా, మగా — అందరూ దానిమ్మ పళ్ళు కొంటానికి పోటీ పడ్డారు.
Also read: శాపం
Also read: ఆనందము — దుఃఖము
Also read: హింస నచణ —- ( ఒక) ధ్వంస రచన
Also read: కీచకుడు లేని “విరాట పర్వం”
Also read: ఎలుకా, పిల్లీ