- ఓటర్లు సైలెంట్ , నేతల్లో ఉత్కంట
- పోలీస్ పహరా, పోలింగ్ పై ఈ సీ డేగకన్ను
- రాజకీయ పార్టీల్లో ఎవరికి వారు ధీమా
- చివరి సారిగా సర్వశక్తులు ఒడ్డనున్న రాజకీయ పక్షాలు
- మావోయిస్టుల చర్యలపై అడుగడుగునా నిఘా
తెలంగాణ లోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరగనున్నది. పోలింగ్ నిర్వహణ కోసం ఇటు ఈసీ అటు పోలీసులు సన్నద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలివెళ్లారు.
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, బిఆరెస్, కాంగ్రెస్ ల మధ్య నువ్వా -నేనా అన్న పోటీ జరుగుతోంది. పోలింగ్ శాతం భారీగా పెంచడానికి ఆయా పార్టీల కేడర్ పరుగులు తీస్తోంది. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకుని రావడానికి కేడర్ సన్నాహాలు చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో విస్తృతంగా పోటాపోటి గా ప్రచారం చేశాయి.
బీజేపీ నుంచి ఆ పార్టీ అగ్రనేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి గల్లీ స్థాయికి వచ్చి ప్రచారం చేయడం అందరిన్ని ఆశ్చర్యపరచింది. బీజేపీని ఒక్క స్థాయిలో పతాక స్థాయికి చేర్చింది. దీంతో బీజేపీ నేతలను పునకాల్లో ముంచింది. తాము అధికారంలోకి వచ్చేస్తున్నామని ధీమా పెరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు గేలిస్తే బీసీ నేతను సీఎం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో బిసి నేతల్లో ఆశావహుల సంఖ్య ఘనంగా పెరిగింది.
కాంగ్రెస్ పార్టీలో గెలుపుపై ఆత్మవిశ్వాసం పతాక స్థాయికి పెంచేసింది. ఎన్నికల ప్రచారంలో కలసి కట్టుగా అందరం ఒకే తాటిపై అధిష్టానం నడిపించిందని పార్టీ నేతల్లో భరోసా పెంచింది. బిఆరెస్ పై తాము అనుకున్నదానికన్నా ఎక్కువ విమర్శల దాడి చేశామని నేతల్లో వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ కి అధిక స్థానాలు వస్తే పీసీసీ అధ్యక్షుడు ఎనుమల రేవంత్ రెడ్డి, సీఎల్ పీ మల్లు భట్టి విక్రమార్కలు మొదటి రేసులో వున్నారు. ఢిల్లీ అధిష్టానం సీఎం ఎంపిక చేస్తుందని పార్టీ సీనియర్ లు వ్యక్తం చేస్తున్నారు.
బిఆరెస్ పార్టీ నుంచి కేసీఆర్ మాత్రమే సీఎం అవుతారని ఆ పార్టీ నేతలు కేటీఆర్. హరీష్ రావు లు విస్తృతంగా ప్రచారంలో ప్రకటించారు. గత పది సంవత్సరాలుగా తాము చేసిన ప్రగతిని ఓటర్లకు వివరించామని బిఆరెస్ హోరేతించింది. దీంతో ముచ్చటగా మూడవ సారి కేసీఆర్ హాట్రిక్ కొడతాడని కేడర్ లో విశ్వాసం పెరిగింది. నేడు జరగబోవు పోలింగ్ సరళిని బట్టి తమ గెలుపు గుర్రాలను గుర్తిస్తామని ఆయా పార్టీల అగ్రనేతలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ఓటర్ల తీర్పు తెలుసుకోవాలంటే డిసెంబర్ 3వ తేదీవరకు వేచి చూడాల్సందే.