Thursday, November 21, 2024

సింగరేణిలో రాజకీయాలు

  • హద్దులు దాటుతున్న రాజకీయ జోక్యం
  • ఏఐటీయూసీ నేత సీతారామయ్య ఆగ్రహం

సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరి కోట్లాది రూపాయల కార్మికుల కష్టార్జితం ‌ దుర్వినియోగ మవుతున్నాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్  ప్రధాన కార్యదర్శి ‌ వేజ్ బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య  అన్నారు. సింగరేణి నిధులను కార్మికుల సంక్షేమానికి ‌ ఖర్చు పెట్టకుండా ‌ ఎమ్మెల్యేలకు, ‌ ఎంపీలకు ‌ దారాదత్తం చేసే సీఎండీ ప్రభుత్వ కనుసన్నల్లో మెలుగుతున్నారని ఆయన ఆరోపించారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు సింగరేణిని నిర్వీర్యం చేసే విధానాన్ని ‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.  ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ‌ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ‌ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన విమర్శలు గుప్పించారు. కారుణ్య నియామకాల కుంభకోణం 10 లక్షల వడ్డీలేని రుణం సక్రమంగా అందడం లేదు.  సింగరేణి ‌ ఆసుపత్రిలో సరైన వైద్యులు లేక వైద్య సౌకర్యం అందడంలేదని దీంతో కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారని సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: కార్మికుల పెన్షన్‌ నిధికి టన్నుకు రూ.10 చెల్లింపుకు సింగరేణి బోర్డు ఆమోదం

మోడీ, కేసీఆర్ తోడు దొంగలు:

గుర్తింపు కార్మిక సంఘం ‌ చేతగాని దద్దమ్మలా ‌ వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను  నిర్వీర్యం చేసేందుకు కార్పొరేట్ శక్తులకు ‌ కట్టబెడుతున్నారని అన్నారు.  44 కార్మిక చట్టాలను ‌ విభజించి ‌ కార్మికులను ఐక్యతను దెబ్బతీస్తున్నారని అన్నారు.  రాష్ట్రంలో కెసిఆర్,  కేంద్రంలో నరేంద్ర మోడీ ఇద్దరు తోడు దొంగలు గా ‌ వ్యవహరిస్తున్నారని సీతారామయ్య అన్నారు. 10వ వేతన కమిటీ కాలపరిమితి అయిపోయి ‌ 11వ వేజ్ బోర్డు కోర్ కమిటీ ‌ అతి త్వరలో ‌ జరుగుతుంది కనుక కార్మికులు ‌ పోరాటాలకు ‌ సిద్ధం కావాలని సీతారామయ్య పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి ‌ సలీం ద్ర సత్యనారాయణ ‌ అధ్యక్షతన ‌ ఈ మీటింగు ‌ జరిగింది. ఈ కార్యక్రమంలో  పాల్గొన్న ఏరియా నాయకులు భీమ నాధుని సుదర్శన్, దాగం మల్లెష్,     ప్రసాద్, ఫిట్ కార్యదర్శులు ‌ జెట్టి మల్లయ్య, వెల్ది ప్రభాకర్, ఎస్ కొండయ్య, కోటయ్య, మనోహర్, సారయ్య, రాజేశం, ఎం వెంకటేశ్వర్లు, సుదర్శన్ లు పాల్గొన్నారు.

Also Read: సింగరేణి డిస్మిస్ కార్మికుల దీక్షలు

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles