ఒక రోజు రైల్లో ప్రయాణం చేస్తున్నాను. చాలా ఖాళీగా ఉంది. ఎదురుగా ఇద్దరు కూర్చొని పోలిస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఒకప్పుడు మనమంటే గౌరవం, భయం ఉండేవి. ఇప్పుడు ఎవ్వరూ లెక్క చెయ్యడం లేదు. విలువ లేదు అంటూ బాధ పడడం చూసి ఆ మార్పుకు కారణమేమిటని అడిగాను.
ఇదివరకు మా ఆఫీసర్లు సమర్థులై డ్యూటీ నిజాయతీగా చేసేవాళ్ళు. ఇప్పుడు నిజాయితీ లేని కారణంగా స్థానిక రాజకీయ నాయకుల అండ కోరి వారి తొత్తులుగా మారడం కారణం అన్నారు. నేరం చేసినవాడికి రాజకీయ నాయకులు మద్దత్తు పలుకుతున్నారు, ఎన్నికల సమయంలో ఉపయోగ పడతాడని. నేరస్తుడిని పట్టుకొచ్చే ధైర్యం కాని, సరైన చట్టంతో కేసు పెట్టే సామర్థ్యం కాని లేవు నేడు. దోషులు మోర విరుచుకుని తిరుగుతుంటే పోలీసులు తలవంచి నమస్కారం పెట్ట వలసిన ఖర్మ పట్టింది మాకు అంటూ వాపోయారు.