- ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నగదు, బైక్ లు స్వాధీనం:
కోడి పందాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై ధర్మారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 పందెం కోళ్ళు, 12 కత్తులు, రూ.84,800 రూపాయల నగదు, 2 బైక్ లు, ఒక కారు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ధర్మారం ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోట్లవనపర్తి గ్రామ శివారులో కొంత మంది పందెం రాయుళ్లు కోడిపందాలు ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో ఆకస్మిక దాడి నిర్వహించి పందెంరాయుళ్లను పట్టుకున్నారు. పందెంరాయుళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. కుంభం వీరయ్య S/o యాదగిరి , వయసు: 32 సంవత్సరాలు, కులం:ఎరుకల, గొల్లపల్లి గొల్లపల్లి మండలం.
2.దాసరి ఈశ్వర్ S/o ఏల్లయ్య, వయసు: 21 సంవత్సరాలు, కులం: ఎరుకల, శంకుల పల్లి, జగిత్యాల
3. మెటపలుకుల అంజిత్ S/o లింగన్న , వయసు:21 సంవత్సరాలు, రాయపట్నం ధర్మపురి
4. దాసరి గంగాధర్ S/o గురవయ్య , ఎరుకల, జగిత్యాల
5 కాసరి తిరుపతి S/o బుచ్చయ్య , వయసు: 40 సంవత్సరాలు, కులం: గాండ్ల, రాయపట్నం.
6. నాస శంకరయ్య s/o చిన్న లక్ష్మయ్య,వయస్సు: 56 సంవత్సరాలు, రాయపట్నం.
7. పిట్టల సత్తయ్య s/o వెంకయ్య,38 సంవత్సరాలు, రాయపట్నం.
నేరాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. పందెం రాయుళ్లు పద్ధతి మార్చుకోకపోతే వారిపై పిడి ఆక్ట్ అమలు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు.