- టీడీపీ ధర్మపరిరక్షణ యాత్ర ఉద్రిక్తం
- టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
త్వరలో తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ తమ వ్యూహాలకు పదునుపెట్టే పనిలోపడ్డాయి.అందరి కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ ముందస్తు కసరత్తు ప్రారంభించిది. ముమ్మర ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేసిన టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్రకు పిలుపునిచ్చింది. తిరుపతి నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ర్యాలీ చేపట్టారు. దీనికి ముందుగా అనుమతినిచ్చిన పోలీసులు ఈ రోజు అనుమతిని రద్దు చేశారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతినిచ్చిన పోలీసులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను హోటల్ నిర్భంధించడం రాష్ట్రంలో జరుగుతున్న నియంతపాలనకు నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు.
ఇది చదవండి: వ్యక్తులు మారినా న్యాయం మారదన్న చంద్రబాబు
హోటల్ లో టీడీపీ నేతల నిర్భంధం:
ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతినిచ్చిన పోలీసులు అనుమతిని రద్దు చేయడమే కాకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ ఆందోళన వ్యక్తంచేసింది. తిరుపతిలో కట్టిన పార్టీ జెండాలను తొలగించారని విమర్శించారు. ధర్మపరిరక్షణ యాత్ర రద్దుకావడంతో టీడీపీ నేతలను నిర్భంధించిన హూటల్ వద్దకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అధికారపార్టీకి కొమ్ము కాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.
ఇది చదవండి: కళా వెంకట్రావు అరెస్టుపై మండిపడుతున్న టీడీపీ
తిరుపతి పర్యటనకు పవన్ కల్యాణ్:
మరోవైపు ఉపఎన్నిక నేపథ్యంలో తిరుపతిలో జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు రేణిగుంట విమానాశ్రయ నుంచి తిరుపతికి ర్యాలీ చేపట్టారు. టీడీపీ, జనసేన నేతల తాకిడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.
: