Thursday, November 21, 2024

నారాయణపేట్ జిల్లాలో పోలీసు జులం, ప్రజలపై దాడులు

జోక్యం చేసుకోవాలని కోరుతూ గవర్నర్ కి మానవ హక్కుల వేదిక లేఖ

తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో నాలుగు గ్రామాలలో ప్రజలపైన పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేశారనీ, అరెస్టులు చేశారనీ, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనీ, ప్రజలు భయంతో గజగజలాడుతున్నారనీ  రాష్ట్ర గవర్నర్ తమిళసాయి సౌందర్ రాజన్ కు మానవ హక్కుల వేదిక నాయకులు తెలియజేశారు. ప్రజల హక్కులను పరిరక్షించాలని అభ్యర్థిస్తూ గవర్నర్ కు ఒక లేఖ రాశారు. లేఖ కింది విధంగా ఉంది:

గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి. తమిళసాయి సౌ oదర్ రాజన్ గార్కి,

నమస్కారములు.

మానవ హక్కుల వేదిక పేరుగల స్వచ్ఛంద సంస్థగత మూడు దశాబ్దాలుగా ప్రజల హక్కుల భంగం, వాటి రక్షణ అంశాల పై కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలోని, నారాయణ పేట్ జిల్లా, మరికల్ మండలoలోని నాలుగు – ఎక్లా స్ పూర్, చిత్తనూరు, జిన్నారం, కన్మనూరు – గ్రామాలకు చెందిన ప్రజల హక్కులకు తీవ్ర భగం వాటిల్లిన సంధర్భంలో వాటి రక్షణ కోసం ఈ రాష్ట్ర గవర్నర్ హోదాలో,రాజ్యాంగ పరిరక్షకురాలిగా ప్రజల హక్కుల భద్రత కోసం జోక్యం చేసుకోమని అభ్యర్తిస్తూ మీకు ఈ బహిరంగ లేఖను రాస్తున్నాం.

నారాయణపేట జిల్లా, మర్రికల్ మండలం, చిత్తనూ ర్ గ్రామంలో  జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ అనే సంస్థ ఒక  ఇథనాల్ అనే రసాయనక  పదార్థం ఉత్పత్తి చేసే కార్మాగారాన్ని నెలకొలిపింది.

ఈ కంపెనీ స్థాపన పారదర్శకంగా జరగలేదు. ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. ఈ కర్మాగారానికి సంబందించిన అంశాలైన వ్యర్థ పదార్థాల నిర్వహణ, జల, వాయు కాలుష్యo వంటి అంశాలు చర్చకు పెట్టి ,  నివారణ చర్యలు, జాగ్రత్తలు తదితర అంశాలు వివరించకుండానే, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అవినీతి పద్దతిలో  అనుమతులు తెచ్చుకుంది. ప్రజలు లేవనెత్తిన అంశాలపై సమాధానo చెప్పకుండా, ప్రజలను బెదిరించి వాళ్ళ నోరు మూయించే నిర్భంద పద్దతులు చేపట్టడంతో గత ఎనిమిది నెలలుగా దాదాపు తొమ్మిది ప్రభావిత గ్రామల రైతులు, ప్రజలు ప్రజాస్వామిక పద్దతిలో  ధర్మాలు, ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. అన్ని అంశాలపై సంబంధిత ప్రభుత్వ శాఖలు ప్రజలతో చర్చలు జరపాలని అప్పటి వరకు ఫ్యాక్టరీలో ఇథనాల్ ఉత్పత్తిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ వ్యతిరేక కమిటీగా  అయిదు గ్రామాల ప్రతినిధులతో  కమిటీ ఏర్పాటై వివిధ పద్ధతుల్లో ప్రజాస్వామికంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టరీ గేటు ముందు నిరసన ప్రదర్శనలే కాకుండా హైదరాబాద్ నగరంతో సహా పలు జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. గత నెలలో 54 గ్రామాల గుండా 11 రోజులు పాదయాత్రలు చేశారు.

ఈ నెల 22వతేది( ఆదివారం)న వ్యర్థాలను తరలిస్తున్న కంపెనీ లారీని ఎక్లాస్ పూర్ గేటు వద్ద ప్రజలు ఆపివేసి అందులో ఏముందో చూపెట్టాలని డిమాండ్ చేస్తూ లారీ ముందు కూర్చున్నారు.

పరిస్తితి ఉద్రిక్తంగా మారడంతో మరికల్ డీ.ఎస్. పి పెద్ద ఎత్తున పోలీసు బలగంతో వచ్చాడు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో, ప్రజలతో మాట్లాడి, పరిస్తితి శాంతింపజేసే ప్రయత్నం చేసే ప్రయత్నం ఏమీ చేయకుండా, డి.ఎస్.పి పోలీసులకు ధర్నా చేస్తున్న ప్రజలపై లాఠీ చార్జి చేయమని  ఆదేశించాడు. పోలీసులు విచక్షణా రహితంగా, మహిళలు,వృద్దులు, పిల్లలు అని చూడకుండా లాఠీలతో కొట్టారు. దాదాపు వందమందికి పైగా గాయాలయినాయి.

దీనికి స్పందనగా ప్రజలు ఆగ్రహంతో కంపెనీ లారీని తగులబెట్టే ప్రయత్నం చేశారు. లారీ పక్కనే ఉన్న పోలీసు వాహనానికి కూడా నిప్పంటుకుంది. దాంతో కోపగించుకున్న పోలీసులు ఇంకా తీవ్రంగా ప్రజలపై విరుచుకుపడి లాఠీ చార్జి చేశారు.

అక్కడ కనిపించిన వాళ్ళందరిని అదుపులోకి తీసుకొని మర్రీకల్ పోలీస్ స్టేషన్ కు తరలిoచారు.

ఆ రాత్రి మరికల్ పోలిస్ స్టేషన్ కు చెందిన పోలీసులు ఎక్లాస్ పూర్, చిత్తనూర్, జిన్నారం, కన్మనూర్, లంకల గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల ఇండ్లపై దాడి చేసి, తలుపులు పగులగొట్టి, మహిళలను, వృద్ధులను విపరీతంగా కొట్టారు. పోలీసులు వస్తున్న వార్త తెలిసి యువ రైతులు, పురుషులు గ్రామాలు విడిచి పారిపోయారు.

అదుపులోకి తీసుకున్న వారిని ఎక్కడ ఉంచిందీ పొలిసులు తెలుపలేదు. రెండవ రోజు (మంగళవారం) కొందరిని మెజిస్ట్రే టు ముందు ప్రవేశ పెట్టారు.

ఇప్పుడు 35 మంది జ్యుడీషయల్ రిమాండ్ లో జైలులో ఉన్నారు. ఇంకా చాలా మంది వేరు వేరు గ్రామాలకు పారిపోయారు. వారం రోజుల తర్వాకూడా కొందరి ఆచూకీ దొరక లేదు.

నిన్న (29-10-2023) 22  మంది యువకులను పోలీసులు ఎక్లాస్ పూర్ గ్రామం నుండి తీసుకెళ్ళారని తెలిసింది. గ్రామాలలో ప్రజలు భయంతో ఉన్నారు. పోలీసు జీపులు రాగానే ప్రజలు ఇంకా భయంతో గ్రామాల పొలిమేరలకు పారిపో తున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నాయకులను పోలీస్ స్టేషన్ లో చిత్ర హింసలకు గురి చేశారని మా సంస్త కు సమాచారం లభించింది. ప్రజలను సమీకరించి ఇంతకాలం నిరసన కార్య క్రమాలు నిర్వహిoచిన బాధ్యులను ఎంచుకొని పోలీసులు చిత్ర హింసలకు గురి చేసినట్టు వాళ్ళ బంధువులు మా సంస్థకు చెలిపారు.

చిత్తనూరు గ్రామానికి చెందిన భండారు లక్షయ్య (కలశాల అధ్యాపకుడు- ఒ.పి. డి. ఆర్ సంస్థ సభ్యుడు) ను కసితో, విపరీతంగా పోలీసులు కొట్టారని ఆయన భార్య మాకు తెలిపింది.

పరిస్థితి ఇట్లా ఉంటే జిల్లా అధికార యంత్రాంగం ఏమి పట్టించుచకోవడం లేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసులను అదుపు చేసే ప్రయత్నం, పోలీసుశాఖ ఉన్నతాధికార్లు చేయడం లేదు. ప్రజలు వెళ్ళి జిల్లా అధి కార్లను కలిసే ప్రయత్నం చేస్తే ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో ఉన్నా మని సమాధానం చెప్పుతున్నారు. గ్రామాల్లోని ప్రజలకు జీవించే హక్కు కే భంగం ఏర్పడింది.

ఇటువంటి పరిస్థితిలో, రాష్ట్ర గవర్నర్ గా, రాజ్యాంగ పరిరక్షక రాలుగా మీరు వెంటనే జోక్యం చేసుకొని చిత్తనూర్ , ఇక్లాస్ పూర్,జిన్నారం, కన్న నూర్ గ్రామాల ప్రజలకు భద్రత కల్పించే దిశగా ఆదేశాలు జారీ చేయాలనీ మా సంస్థ వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తుంది .

– గౌరవాలతో

డాక్టర్ తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

డాక్టర్. కె.బాబురావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

యస్. జీవన్ కుమార్, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు

మానవ హక్కుల వేదిక, తెలంగాణ రాష్ట్రం.

Dt.01-11-2023

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles