Wednesday, January 22, 2025

ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

ఆంధ్రుడు త్యాగ జీవే

కాని భోగ జీవి కాడు
శ్రీరాముల త్యాగం వ్యర్ధమై
రెండు అర్ధాలై
విడి పోయి ఓడి పోయాము !

మన భాష విషయం లో
కేంధ్రానిది మంధర పాత్రే కదా !

అన్ని రాష్ట్రాల శిశువులకు
కేంద్రం నుండి క్షీరమందితే
మనకు నీరం కూడా
లేక నోరు ఎండుతోంది !

ప్రత్యేక హోదా సవితి తల్లి
పండగ పూట పెట్టే
తాయిలం కదా !

ప్రతీ బడ్జెట్ ఒక ఎండమావి
మన ఆంధ్రా ఎండి పోయిన బావి
రైలు బడ్జెట్ లన్నీ
పట్టాలు తప్పిన రైళ్ళే
గద్దెల నిండా
గద్ద లే !

నీటి ప్రాజెక్టులన్నీ
ఏటి పాలే
విశాఖ ఉక్కు అంటే
కార్పోరేట్ హక్కు గా మార్చే
కుట్రలే !

ఇక ఈ దేశం
ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ?!

Veereswara Rao Moola
[email protected]

Also Read : మిత్రమా ఇక యుద్ధం అనివార్యమే !

వీరేశ్వర రావు మూల
వీరేశ్వర రావు మూల
సాహితి వివరాలు : 1985 నుంచి రాస్తున్నా. వివిధ పత్రికల్లో కధలు,కవితలు,కార్టూనులు వస్తున్నాయి. ఆంగ్లం లో కూడా వంద కి పైగా కవితలు వెబ్ పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వృత్తి : నిర్మాణ రంగం లో ఐటీ విభాగం మేనేజర్ ఉద్యోగం ఆంగ్లం లో Vibrations of my heart Amazon Kindle పుస్తకం గా ప్రచురణయ్యింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles