వింత వింత ఉపమానాలు వందలు వందలు,
కవి కలం చిందులు, మృష్టాన్న విందులు.
ప్రేమలేఖలు మోసే మబ్బులు
పలుకరించు పూలు, అవునని తలలు ఊచుచెట్లు
సూచనలు చేయుగాలులు ,
కోరికలు రగిలించు చంద్రుని శీతల కిరణాలు
ప్రవహించే పచ్చిక బయళ్లు… వర్షించే ఆశీస్సులు…
కోయిల కూనిరాగాలలో సరిగమలు
ఉషోదయపు మంచు బిందువులో, ప్రథమ ప్రేమ రుచి…
నాగుపాము వంటి జడ, ఆకాశం వంటి కనులు…
వింత వింత ఉపమానాలు వందలు వందలు,
కవి కలం చిందులు, మృష్టాన్న విందులు.
ప్రేమ జాలువారితే జావళి
విరహంతో చంద్ర ఉపాలంబం
సంరంభంలో వృత్యనుప్రాసం,
బాధ కలిగితే భ, ర, న, భ, భ, ర, వ,
కోపమొస్తే ముక్త పద గ్రస్తం…
చెమ్చాలలో తుఫానులు, ఎరుపెక్కిన సముద్రం అలలు!
వాస్తవికత వారిని కదిలిస్తే , అధి వాస్తవికతతో వాపోతారు…
ఆహా… వారిలో ఊరే భావాలతో మారే సిరా రంగు.
అలుసు చేస్తున్నానని అలుగకండి
కవి మిత్రులారా
నేను మీ జాతే, ఒప్పుకొందాం
మనందరి లక్షణం, విలక్షణం
Also read: గాలిపటం
Also read: పంది కొక్కులు
Also read: చరిత్రకారుడు
Also read: యుద్ధం
Also read: ఎవ్వడు వాడు