లలిత కళలు మనిషిలో సున్నితత్వాన్ని తద్వారా మంచిని పెంచుతాయి. అందులో కవిత్వానిది అగ్ర తాంబూలం. మనసులో కలిగే భావనల ప్రతిరూపమే కవిత్వం. జంట పక్షుల్లో ఒకటి వేటగాడి బాణానికి గురై చనిపోయినపుడు ఓ కిరాతకుడు మహాకవిగా, మహర్షిగా మారాడు. ఆనాటి స్పందనే రామాయణ కావ్యం.
ఒకప్పుడు సంస్కృత పదాలతో, చందస్సు, యతి, ప్రాసలతో నిండిన కవిత్వం నేడు బంధాలు తెంపుకుని భావ, విప్లవ, ఆధునిక కవిత్వాలుగా ధ్వని, రమణీయత కోసం ప్రతీకలు, భావ చిత్రాలు ఉపయోగించుకుంటూ సామాన్యుడి భాషలో రసరమ్య సౌరభాలు వెదజల్లూతూ సాగుతూంది. సద్విమర్శ తోడైతే మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుంది.
Also read: ద్వైతం
Also read: అహం-కారం
Also read: విభ-జనం
Also read: ఆ-కలి
Also read: మన రాజ్యం