కోల్‌కతాలోని భారతీయ భాషా పరిషద్ తెలుగులో ప్రముఖ కవి డాక్టర్. ఎన్. గోపికి ప్రతిష్టాత్మకమైన “కృతిత్వ సమగ్ర సమ్మాన్” పురస్కారాన్ని ప్రకటించింది.
అవార్డు ప్రదానోత్సవం (అలంకరణ్ సమారోహ్) ఏప్రిల్ 8, 2023 సాయంత్రం 4 గం౹౹కు కోల్‌కతాలోని పరిషద్ సభాగారంలో జరుగుతుంది.
పురస్కారం కింద లక్ష రూపాయల నగదు, అంగవస్త్రం, సైటేషన్‌లను బహూకరిస్తారు. 2020 మార్చిలో జరగాల్సిన ఈ కార్యక్రమం కరోనా కారణంగా మూడేళ్లు ఆలస్యంగా జరుగుతోంది. ఈ మేరకు పరిషద్ అధ్యక్షురాలు డాక్టర్. కుసుమ్ ఖేమాని ఒక ప్రకటనలో తెలిపారు.
తెలుగు కవిగా, బోధకుడుగా ఆచార్య గోపీ లబ్ధప్రతిష్ఠులు. వేమన ఆయన అభిమాన కవి. టుమ్రీలకు చిరునామా. కాలంతో పాటు మారుతూ వచ్చిన కవి. అనేక సంకలనాలు ప్రచురించారు. ఆయన కవితలను ప్రచురించిన సంస్థలలో ‘సకలం’ ఒకటి. ఈ మధ్యనే ‘వృద్ధోపపనిషత్’ ప్రచురించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత. సంచాలకులు. ఆయన అందుకున్న పురస్కారాలు అనేకం.