అక్కడ నీవు ఇక్కడ నేనైనా
ఎప్పుడు నీవు నాకు దగ్గరే
నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ నీ శరీర సహజ సుగంధం,
నన్ను వెచ్చగా తాకుతూ నీ ఊపిరి,
చేరువగా, మరింత చేరువగ
మెత్తగా హత్తుకొంటున్న నీ సుకుమార స్పర్శ ,
నా ఆత్మను పలకరిస్తున్న నీ ఆత్మ ,
అతి సమీపంలో జంకుతూ వణకుతూ ముందుకు
చేరువవుతున్న నీ రెండు తీయని అధరాలు …
నా నడత నాకే తెలియని విచిత్రం ,
అదేమిటో, అదెలాగో తెలియదు కానీ
ఎండమావిలో నీరు తాగుతాను,
సుదూర విహారి నిండు చందమామ ను
ముద్దాడతాను, నా రోజులు ఎలా గడుస్తున్నాయో
మరచిపోతాను…నీ తీయని ఆలోచన ల వెచ్చదనంలో.
ఇది కల్పితకల్పన గా అనిపిస్తుంది
… నా నిజం, ప్రేమ తర్కానికి అందదు మరి
నా హృదయం కాలాన్ని దూరాన్ని లెక్క చేయదు
ఏమో నేను పిచ్చి వాడినేమో?
ఏం నేనొక్కడినే నా ఇలా… ఉంటారు వేలకొలది స్వప్న జీవులు
అయినా ఎవరు చెప్పలేరు ఈ వ్యసనపు ఆనుపానులు.
Also read: నిశ్శబ్ద గీతిక
Also read: కర్మ ఫలం
Also read: జ్ఞాపకాలు