Thursday, November 21, 2024

భోగాలు రోగాలకు దారితీస్తాయి

భగవద్గీత – 66

`నేరం ఎందుకు చేశాడు?` `ఇంత బాగా మాట్లాడుతున్నాడు ఇతను హత్యచేశాడా?` `ఇంత బుద్ధిగా ఉన్నాడు`, `ఇతను స్త్రీని మానభంగం చేశాడా` అని అనిపించింది నాకు. ఒకసారి ఒక జైలులోఉన్న ఖైదీలకు సద్బోధ చెయ్యమని జైలరుగారు నన్ను తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ ఖైదీలతో మాట్లాడిన తరువాత నాకు కలిగిన భావమిది.

వారు నేరం ఎందుకు చేశారు?

Also read: విషయాలపై ఆసక్తి పతన హేతువు

ఏదో కోరిక. శరీరాన్ని దహించివేసే కోరిక. నిలువనీయని కోరిక ఆ మనిషిలో కలిగినప్పుడు, అది తీరకుండా ఎవరయినా అడ్డుతగిలినప్పుడు, ఆ అడ్డుతగిలినవాడిమీద క్రోధం పుడుతుంది. దానివలన గుండెకొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు అధికమవుతుంది. శరీరంలో ఎడ్రినాలిన్‌ (adrenaline), ఉత్పత్తి అధికమవుతుంది.

ఇది fight or flight situationకి దారితీస్తుంది. క్రోధము వలన సమ్మోహము జనియిస్తుంది అంటారు పరమాత్మ. అంటే మనిషి ఉన్మాది అవుతాడన్నమాట! ఒక్కసారి ఉన్మాదము ఆవరిస్తే, తానెవరో తన social status ఏమిటో అన్నీ మరచిపోతాడు. ఆ మరపు బుద్ధి నాశనానికి దారి తీస్తుంది. బుద్ధి అంటే మనిషికిగల యుక్తాయుక్త విచక్షణ (Rational discrimination). బుద్ధినాశనమయితే ఇంకేముంది… సర్వం నాశనమే.

Also read: నరకంలో ప్రవేశించేందుకు మూడు ద్వారాలు

అప్పుడు జరుగుతుంది నేరం. దీనికి కారణం. మనము మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనక పోవడమే. కేవలం విషయాసక్తి ఇంతపని చేయిస్తుంది.

`భోగాభవమహారోగాః` అని ఎక్కడో చదివిన గురుతు. (యోగవాశిష్టములో అనుకుంటా) భోగాలు రోగాలకు దారితీస్తాయట!

ఇన్ని సంవత్సరాల బ్యాంకు మేనేజరుగా నా అనుభవం ఏమిటంటే, మనుషులు మంచివాళ్ళే, డబ్బే పాపిష్టిది. కోరికలు డబ్బు ద్వారానే కదా తీరేది!

పరమాత్మ రెండవ అధ్యాయములో చెప్పినది చూడండి!

క్రోదాద్భవతి సమ్మోహః సమ్మోహాత్‌ స్మృతి విభ్రమః

స్మృతిభ్రంశాత్‌-బుద్ధినాశో బుద్ధినాశాత్‌ ప్రణశ్యతి

Also read: సాత్త్విక తపస్సులు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles