రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ,సిని నటుడు ప్రకాశ్ రాజ్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. రాష్ట్రంలో మూడో సారి అధికారం కైవసం చేసకునేందుకు గలాబి అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త ప్రకాంత్ కిషోర్ ను నియమించుకున్నాట్లు వార్తాలు వచ్చిన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించడం ప్రాధన్యాత సంతరించుకుంది. అయనతోపాటు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడ సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి పరిశీలించారు పీకే. ఆ తర్వాత మల్లన్నసాగర్ నిర్వాసితులతోనూ మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తోంది పీకే టీమ్. గత రెండు రోజులుగా తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ పర్యటన సాగుతున్నది. ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే పనిలో భాగంగానే మల్లన్నసాగర్‌ను పరిశీలించడం, భూ నిర్వాసితులతో చర్చించడం అసక్తిగా మారింది. దీంతో పికే టీం ఇచ్చే సలహలతో రాష్ట్రంలో రాజకీయ వేడి ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.