———————————————
PITY THE NATION
BY KAHLIL GIBRAN
స్వేచ్ఛానువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
——————————————-
నమ్మకాలతో నిండి పోయి,
‘ తత్త్వం ‘ లేని మతం
మాత్రమే మిగిలిఉన్న
దేశాన్ని చూసి — ‘ జాలి పడు.‘
తను నేయని వస్త్రాలు ధరించే,
తాను పండించని రొట్టె తినే,
తాను తయారు చేయని మద్యం తాగే
దేశాన్ని చూసి — ‘ జాలి పడు ‘
బెదిరించే వాడిని
గొప్పవాడిగా ప్రశంసించే,
మెరిసిపోయే విజేతను చూసి
ఉదార స్వభావుడని భావించే
దేశాన్ని చూసి — ‘జాలి పడు‘
కలలో తృణీకరించే భావావేశాన్ని
మెలకువలో ఒప్పుకునే
దేశాన్ని చూసి — ‘జాలి పడు‘
ఏ దేశమైతే —
అంతిమ శవ యాత్రలో
మాత్రమే
తన స్వరం వినిపిస్తుందో,
శిధిలాల మధ్య
మాత్రమే
ప్రగల్భాలు పలుకుతుందో,
వధ్య శిలకు ఖడ్గానికి మధ్య
కంఠం పెడితే తప్ప తిరగబడదో
ఆ దేశాన్ని చూసి— ‘జాలి పడు‘
ఏ దేశపు —
రాజ నీతిజ్ఞుడు ఓ గుంట నక్క ఔతాడో,
తత్త్వ వేత్త గారడీ వాడవుతాడో,
ఏ దేశానికి అతుకులు వేసే, అనుకరించే
కళ మాత్రమే తెలుసో
ఆ దేశాన్ని చూసి— ‘జాలి పడు‘
ఏ దేశమైతే తన క్రొత్త నేతను
బాకాలూది ఆహ్వానిస్తుందో,
అదే నేతకు
ఎగతాళి చేస్తూ అరుపులతో
వీడ్కోలు చెబుతుందో,
తిరిగి ఇంకొక నేతకు
బాకాలూది స్వాగతిస్తుందో
ఆ దేశాన్ని చూసి — ‘ జాలి పడు ‘
ఏ దేశంలో అయితే —
మునులు ముదిమితో
‘ మూగ ‘ వోతారో
బలాఢ్యులు ఇంకా
ఊయలలోనే జోగుతూ ఉంటారో
ఆ దేశాన్ని చూసి— ‘ జాలి పడు ‘
ఏ దేశమైతే —
శకలాలుగా విడి పోతుందో,
ప్రతీ శకలమూ–తనను తాను
ఒక దేశంగా భావిస్తుందో
ఆ దేశాన్ని చూసి — ” జాలి పడు!”
(Source Google)
( Kahlil Gibran died in 1931)
Also read: పరిపూర్ణ జీవనం
Also read: నర్తకి
Also read: శాంతి – యుద్ధము
Also read: “నేతి”
Also read: వేదన