Friday, December 27, 2024

ఉత్తములను ఇతరులు అనుసరిస్తారు

భగవద్గీత 80

ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?

ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే పలుకుతుంది!

వాడు అచ్చం వాళ్ళనాన్న చేసినట్లే చేస్తాడు. ఆ తినటం కానీ, కూర్చోవటం  కానీ పడుకోవడం గానీ… ఇలాంటి మాటలు పసిపిల్లలున్న ఇంట్లో మనం వింటూ ఉంటాము.

మన ప్రతి ప్రవర్తన, మన ప్రతి చేష్ట ఎవరో ఒకరినుంచి చూసి మనం తెలుసుకున్నదే, నేర్చుకున్నదే. We learn through imitations first by observing others and then reproducing, or copying a behavior or an act.

Also read: విజ్ఞుల సలహాలు స్వీకరించాలి

స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ప్రతి ఒక్కరూ దాదాపుగా గాంధీగారి పిలుపువిని వంటిమీదున్న నగలతోసహా వలిచి ఇచ్చేశారు. ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి దేశం కోసం ధారపోశారు. ఆ రోజున తనకున్నది ఎదుటివారికి ఇవ్వడం ఒక ఆదర్శం. అలా చాలా విలువలు సమాజంలో ఉండేవి. మరి ఈ రోజు ఎదుటివాడి వద్దనుండి తీసుకోవడం ఆదర్శం. సమాజం చెడిపోయింది. లంచగొండితనం పెరిగింది. స్త్రీలకు రక్షణ కరువయ్యింది అని వాపోతున్నాం.

ఎందుకు ఈ తేడా?

ఆ రోజులలో పౌరులు ఆదర్శంగా ఎవరిని తీసుకునేవారు? ఒక రాముడినో, హరిశ్చంద్రుడినో, ఒక ధర్మరాజునో, దానం విషయంలో కర్ణుడినో… వీరులగాధలువిని వారిలాగా ఉండాలని, వారినో ఆదర్శంగా తీసుకునేవారు. వారి కధలు విని వారిలాగా ఉండటానికి ప్రయత్నిం చేనేవారు.

A dishonoured cheque is hardly known in India… Prof Max Muller, తన “India what it can teach us” అనే పుస్తకంలో వ్రాశారు…

Also read: ఫలితంపైన  ఆసక్తి అనర్థదాయకం

మరి నేడో?

పేపర్లనిండా అప్పు ఎగ్గొట్టినవారి వార్తలే. ఎందుకు ఇలా మారిపోయింది? నాడు పిల్లలకు విలువలు పాటించినవారి కధలు చెప్పేవారు. పిల్లలు వాటినే అనుకరించేవారు. నేడు?

హింస ఎక్కువ ఉన్న వీడియో గేములు, అశ్లీల సాహిత్యం ఎక్కడ పడితే అక్కడ లభ్యం కావడం (at a click of a button), TVలలో ప్రకటనలు, నల్లగా ఉంటే ఆత్మన్యూనత, ఖరీదైన ఫీచర్లులేని ఫోను లేకపోతే న్యూనత, పలువరుస ఎగుడుదిగుడుగా ఉంటే న్యూనత, జుట్టు తెల్లబడితే న్యూనత, మొత్తం ఆత్మన్యూనతే కదా నేర్పుతున్నాం. ఆడంబరాలే జీవన విధానం అని నొక్కి వక్కాణించడం.

ఇది వాతావరణం! ఈ వాతావరణం ఆధునిక జీవనంలో మనం నిర్మించుకున్నదే. కాబట్టి పిల్లవాడు ఎదుగుతూ అవే నేర్చుకుంటాడు. అవే శ్రేష్ఠమనుకుంటాడు. వాటినే అనుకరిస్తాడు. అలానే తయారవుతాడు… Environment, Stupid!

అందుకే పరమాత్మ చెప్పారు!

యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః

స యత్‌ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

ఉత్తములైనవారు దేనిని అనుసరిస్తారో ఇతర జనులు, లోకమంతా కూడా దానినే ప్రమాణంగా తీసుకొని దానినే పాటిస్తారు.

నాటి పిల్లలకు శ్రీరామనవమి పండుగఅయితే, నేటి పిల్లలకు Valentines Day పండుగలాగ అందుకే కనపడుతున్నది.

Also read: హృదయదౌర్బల్యం విసర్జించాలి

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles