- సీఎం జగన్ పథకాలే గెలుపునకు మార్గం
- ప్రజలే అభివృద్ధి చదువు నేర్పించారు
- జేసీ అబద్దాలు చెప్పడంలో దిట్ట, తను చేయకపోయినా చేసినట్లు చెప్పడం జేసీ నైజం.
- ఎదుటివారిని వరే, తరే అన్నది జేసి భాష
2024లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నుంచి ఎన్నికల బరిలో తాను గెలుస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి జగన్ పథకాలే తనను గెలిపిస్తాయని అయన ధీమా వ్యక్తం చేసారు. ప్రజలే అభివృద్ధి చదువు నేర్పించారాని ఆయన కొనియాడారు. తనకు చదువు రాదని తన ప్రత్యర్థులు జేసి సోదరులు చెప్పడాన్ని అయన ఖండించారు. ప్రజలకు సేవ చేయడానికి చదువులు ముఖ్యం కాదన్నారు. జేసి సోదరులు ఉన్నత చదులు చదివామని చెప్పుకోడానికే పరిమితం అయ్యారని అయన సెటైర్లు వేశారు. 40 సంవత్సరాలనుండి వారు చేసిన ప్రగతి పై చర్చకు సిద్దామా అంటూ అయన నీలదీశారు. జేసి సోదరులు అబద్దాలు చెప్పడంలో దిట్టలని ఆయన కన్నెర్ర చేసారు. వారు చేయకపోయినా తామే చేశామని చెప్పుకోడం సిగ్గుచేటని, అది వారి నైజం అన్నారు. ఎదుటివారిని వరే, తరే అని సంబోధించడం వారి సభ్యత, సంస్కారం అంటూ నిప్పులు చేరిగారు. ఇలాంటి వారు చదువులు గురించి చెప్పడం శోచనీయం అన్నారు. తాను పెద్ద చదులు చదవకపోయినా అధికారులతో అభివృద్ధి పై సమీక్షలు జరిపి పనులను పురోగతి వైపు నడిపిస్తున్నట్లు అయన గుర్తు చేసారు.
నాకు చదువు లేదని నా ప్రత్యర్థులు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడుతున్నారని, ఐతే నియోజకవర్గం ప్రజలు మాత్రం తనకు ఎమ్మెల్యే స్థాయి ఇచ్చినరాని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేసారు. చదువు లేకపోయినా సంస్కారం, సభ్యత, కలుపుగోలుతనం తనకు ప్రజలు నేర్పించారాని కేతిరెడ్డి పెద్దారెడ్డి విశ్వాసం వ్యక్తం చేసారు. ప్రజల అవసరాలు గుర్తెరిగి పని చేస్తే గెలుపు వారే నిర్ణయస్తారని పెద్దారెడ్డి ధీమా వ్యక్యం చేసారు. 2024 ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందన్న భరోసా ఆయన వ్యక్తం చేసారు. తన పనితీరుపై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు మెచ్చిన నేతగా గుర్తింపు వచ్చిందన్నారు. జగన్ అమలు చేసిన గడప గడపకు కార్యక్రమం తమను ప్రజల వద్దకు చేర్చిందన్నారు. తాడిపత్రి నియోజకవర్గం లో అన్ని మండలాల్లో పంటల భీమా డబ్బులతో రైతులకు భారీగా లబ్దిచేకూరిందని అన్నారు. మండలాల్లో మంచినీళ్లు తో పాటు సాగు నీటిని తీసుకురావడంలో తను సక్సెస్ అయ్యానని అన్నారు. పెద్దవడుగూరు మండలానికి రెండు పంటలకు సాగునీరు అందించిన ఘనత తనదేనని ఆయన గట్టిగా చెప్పారు. పెద్దపప్పూరు మండలంలో చాగల్లు రిజర్వాయర్ లో నీటి నిల్వ చేయడంతో మండలంలో మంచినీళ్లు, సాగునీటి కి కొరత లేదన్నారు. సాగునీళ్లు పుష్కలంగా ఉన్నందున రైతులు అన్ని పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. యాడికి మండలంలో రాయలచెరువు కు మూడుసార్లు నీటిని నింపామని అన్నారు. తాడిపత్రి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి పెన్నా, గండికోట ప్రాజెక్టుల నుంచి మంచినీళ్లు సరఫరా చేస్తున్నామని చెప్పారు. తాడిపత్రిలో మురుగునిటీ కాల్వలు మెరుగు పర్చడానికి మరమ్మతులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. పట్టణంలో విద్యుత్ సౌకర్యం మెరుగు పర్చడానికి స్తంభాలు, వైర్లు మార్చుతున్నామని అన్నారు. దాదాపు పట్టణంలో 700 విద్యుత్ స్తంభాలు మార్చుతున్నామని ఆయన గుర్తు చేశారు. పెండెకల్లు రిజర్వాయర్ కు సాగునీటిని రప్పించామన్నారు. ముచ్చుకోట రిజర్వాయర్ సాగునీటితో నింపడంతో రిజర్వాయర్ చుట్టుపక్కల గ్రామాల్లో బోరు బావుల్లో నీళ్లు పుష్కలంగా వున్నాయన్నారు. దీంతో రైతులు అన్ని పంటలు సాగుచేసుకుంటున్నారని అయన గుర్తు చేసారు. తాడిపత్రి లో మట్కా, జూదం, బెట్టింగులు లేకుండా గట్టి చర్యలు తీసుకున్నామని, ఇలాంటి చర్యలతో సామాన్యుల జీవితాల్లో సంతోషాలు చూస్తుంటే ఆనందం వ్యక్తం అవుతుందన్నారు. తాడిపత్రి లో అక్రమాలను ప్రోత్సహించిన చరిత్ర జేసి సోదరులకు ఉందాన్నారు అన్నింటిలో వాటాలు తీసుకున్న చరిత్ర జేసి సోదరులదేనని పెద్దారెడ్డి ఆరోపించారు.