————————–
( From ” The Wanderer” by KAHLIL GIBRAN)
(తెలుగు సేత: Dr.C.B. Chandra Mohan)
ముత్యం
————————–
ఒక. ఆల్చిప్ప పక్క ఆల్చిప్పతో ఇట్లా అంది.
” నాకు లోపల చాలా నొప్పిగా ఉంది. అది బరువుగా , గుండ్రంగా ఉంది. నేను విపరీతమైన
బాధలో ఉన్నాను.”
రెండో ఆల్చిప్ప అహంకారంతో కూడిన ఆత్మసంతృప్తితో ఇలా అంది ” ఆకసాన్ని , సాగరాన్ని ప్రశంసించాలి. నేను లోనా, బయటా కూడా పరిపూర్ణంగా, చాలా బాగా ఉన్నాను.”
అదే సమయంలో ఒక పీత అటువైపు పోతూ,
ఆ ఆల్చిప్పల సంభాషణ విని ,– ‘ నేను పరిపూర్ణంగా ఉన్నాను’ అన్న ఆల్చిప్పతో ఇలా చెప్పింది “అవును. నువ్వు పరిపూర్ణవతివి. చాలా బాగున్నావు. కాని, నీ పక్క ఆల్చిప్ప పడే ‘బాధ ‘ ఏ మిటో తెలుసా? అది ఒక అద్భుత సౌందర్యమున్న ముత్యం.”
Also read: సంచారి “తత్త్వాలు”
Also read: సంచారి తత్త్వాలు
Also read: సంచారి తత్త్వాలు
Also read: సంచారి “తత్త్వాలు”