————————-
(‘PEACE CONTAGIOUS ‘ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN )
తెలుగు అనువాదం:డా. సి.బి. చంద్ర మోహన్
41. సంచారి తత్త్వాలు
————————————–
ఒక చివురించే కొమ్మ తన పక్క కొమ్మతో ఇలా అంది.” ఇవాళ ఒక నిస్తేజమైన, ఖాళీ రోజు. పొరుగు కొమ్మ ” అవును. నిజంగా ఇది ఒక నిస్తేజమైన, ఖాళీ రోజు.” అంది.
అదే సమయంలో ఒక పిచ్చుక వచ్చి ఒక కొమ్మ మీద వాలింది. దగ్గరలో ఇంకో పిచ్చుక వాలింది. వాటిలో ఒక పిచ్చుక కిచ కిచ మంటూ ఇలా చెప్పింది. ” నా సహచరి నన్ను వదిలేసింది.”
రెండో పిచ్చుక కూడా ఏడుస్తూ ” నా సహచరి కూడా వెళ్లి పోయింది. మరలా తిరిగి రాదు. నేనేమి చెయ్యాలి?”
అప్పుడా రెండు పిచ్చుకలూ అలజడి చేస్తూ తిట్టుకోసాగాయి. భయంకరమైన శబ్దాలు చేసాయి.
అంతలోనే, అకస్మాత్తుగా మరో రెండు పిచ్చుకలు ఆకాశంలో ఎగురుతూ వచ్చాయి. అవి కొమ్మమీద ఆందోళన పడుతున్న పిచ్చుకుల పక్కన నిశ్శబ్దంగా కూర్చొన్నాయి. ప్రశాంతత ఏర్పడింది.
అప్పుడు ఆ నాలుగు పిచ్చుకలూ కలిసి జంటలుగా ఎగిరిపోయాయి.
మొదటి కొమ్మ రెండో కొమ్మతో ఇలా అంది. “అదొక పెద్ద రణ గొణ ధ్వని.”
రెండో కొమ్మ ” నువ్వేదైనా అను. ఇప్పుడు ప్రశాంతంగానూ, విశాలంగానూ ఉంది. ఐనా గాలి ప్రశాంతమైతే — క్రింద నివసించేవారు కూడా ప్రశాంతత సమకూర్చుకోవాలి. గాలిలో ఊగి నాదగ్గరకు వస్తావా?” అంది.
మొదటి కొమ్మ ” ప్రశాంతంగా ఉండటానికి ఇదే అవకాశం. వసంత కాలం అయిపోతోంది!”
తరువాత రెండో కొమ్మను కౌగలించుకోటానికి బలమైన గాలిలో ఊగుతూ వచ్చింది.
Also read: మంచి — చెడు
Also read: కాలం
Also read: తిమింగలము — సీతాకోకచిలుక
Also read: మార్గము
Also read: రాజదండము