భూములను అక్రమంగా లే అవుట్లు చేసి అట్టి భూములను బినామీల పేర్ల పై రిజిస్ట్రేషన్ చేయించుకుని తను కొనుగోలు చేసిన భూమితో లభించే ప్లాట్ల కన్నా ఎక్కువ విస్తీర్ణము అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న తోట శ్రీనివాస్ పై పీడీ యాక్ట్ అమలు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో *తోట శ్రీనివాస్, తండ్రి: మల్లయ్య, వయసు 52 సంవత్సరాలు, కులం: మున్నూరు కాపు, వృత్తి: రియల్ ఎస్టేట్ వ్యాపారం, నివాసం: ACC, గోదాం ఎదురుగా, ఏసీసీ మంచిర్యాల్ మంచిర్యాల జిల్లా, అను వ్యక్తి పై రామగుండము పోలీస్ కమిషనర్ పీ.డీయాక్ట్ ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను మంచిర్యాల పట్టణ సీఐ ముత్తి లింగయ్య పీ.డీ యాక్ట్ నిర్బంద ఉత్తర్వులను నిందితునికి అందజేసి అనంతరం వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించడమైనది.
Also Read : గొల్ల కుర్మా దేవాలయంలో మాజీ మంత్రి వినోద్ పూజలు..
నిందితుని యొక్క నేరము చేయు విధానము
నిందితుడు పై 2018 సం,, నుండి 2020 సం,, వరకు మొత్తం 12 కేసులు నమోదు చేయడం జరిగింది.2020 లో 04 కేసులు నమోదు చేయడం జరిగింది.
నిందితుడు ఒక భూ కబ్జాదారునిగా చాలా నేరములను చేస్తూ ఒక గ్యాంగ్ ఏర్పరచుకొని, లీడర్ గా/ మెంబర్ గా ఉంటూ అక్రమ కార్యకలాపాలలో పాలుపంచుకుంటూ అలవాటుగా భూములను అక్రమంగా లే అవుట్లు చేసి అట్టి భూములను బినామీల పేర్ల పై రిజిస్ట్రేషన్ చేయించుకుని, తను కొనుగోలు చేసిన భూమితో లభించే ప్లాట్ల కన్నా ఎక్కువ విస్తీర్ణము అమ్ముతూ తన వద్ద ప్లాట్లు కొన్న యజమానులకు తన పక్కన ఉన్న వారి భూములలో కబ్జా చూపిస్తూ, అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ తమ జీవితాంతం కూడబెట్టిన డబ్బులతో తన వద్ద ప్లాట్లు కొన్న ప్లాట్ల యజమానులనే కాక తన పక్కన ఉన్న భూముల యజమానులను కూడా మోసం చేయుచూ వారి జీవితకాల కష్టాన్ని కొల్లబొడుస్తూ ఒక పథకం ప్రకారంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో తన అక్రమ కార్యకలాపాలను కొనసాగింకూచున్నాడు. పై నేరస్తుడి అక్రమ దందాల వలన సామాన్య ప్రజలు వారి ఆస్తుల భద్రత విషయంలో సంకోచిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ప్రజా శాంతికి ముప్పు తెచ్చేలా ఉన్నాయి.
నిందితునిపై పీడీ యాక్ట్ అమలు చేయుటకు కృషి చేసిన మంచిర్యాల సీఐ ముత్తి లింగయ్య ని ఎస్ఐ లను సిపి అభినందించారు.
Also Read : బాధ్యులపై చర్యలు తీసుకొని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి