- కొహ్లీ, రోహిత్, ధోనీలను మించిన కంగారూ పేసర్
ప్రపంచ టాప్ ర్యాంక్ బౌలర్, ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్…ఐపీఎల్ ఆర్జనలో సరికొత్తరికార్డు నెలకొల్పాడు. భారత సూపర్ స్టార్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలను మించిపోయాడు.
ఐపీఎల్ 13వ సీజన్ వేలంలో కమిన్స్ కు 15 కోట్ల 50 లక్షల రూపాయల ధరకు సొంతం చేసుకొన్నకోల్ కతా ఫ్రాంచైజీ…ఈ ఏడాది జరిగే 14వ సీజన్ కు సైతం కమిన్స్ కాంట్రాక్టును కొనసాగించాలని నిర్ణయించింది.
అంతంత మాత్రమే
గల్ఫ్ దేశాలు వేదికగా ముగిసిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలలో కమిన్స్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. మొత్తం 14 మ్యాచ్ లు ఆడి 12 వికెట్లు మాత్రమే సాధించిన కమిన్స్ ను 14వ సీజన్ కూ కొనసాగించాలని కోల్ కతా ఫ్రాంచైజీ నిర్ణయించింది. భారత్ తో ఇటీవలే ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో కమిన్స్ అత్యధికంగా 21 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సైతం కైవసం చేసుకొన్నాడు. టెస్టు సిరీస్ లో కమిన్స్ పూర్తిస్థాయిలో రాణించడంతోనే కోల్ కతా ఫ్రాంచైజీ తమజట్టులోనే కొనసాగించాలని నిర్ణయించింది.
Also Read : యువక్రికెటర్లకు నజరానాల వెల్లువ
ముగ్గురిని మించిన మొనగాడు
ఐపీఎల్ 13సీజన్ల చరిత్రలోనే అత్యధికంగా 15 కోట్ల 50 లక్షల రూపాయల రికార్డు ధర దక్కించుకొన్న ఘనత కమిన్స్ కు మాత్రమే దక్కుతుంది. 2018 సీజన్ నుంచి అత్యధికంగా 15 కోట్ల రూపాయల చొప్పున అందుకొంటున్న భారత సూపర్ స్టార్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలను కమిన్స్ అధిగమించడం విశేషం.
Also Read : ఐపీఎల్ -14 వేలం వారం వాయిదా
బెంగళూరు, ముంబై, చెన్నై ఫ్రాంచైజీల దిగ్గజ ఆటగాళ్ల హోదాలో కొహ్లీ, రోహిత్, ధోనీ సీజన్ కు 15 కోట్ల రూపాయల చొప్పున వేతనం అందుకొంటున్నారు.