గోగణమే సంపద ఒకనాడు
గృహప్రవేశం నాడే అవసరం ఆవు నేడు
ఇంటింటా ఆవులు ఆనాడు
వంటింట్లో పాల పొట్లాలు నేడు
ప్రకృతితో మమేకం నాడు
వికృత కరోనాతో సహజీవనం నేడు
వన భోజనాలు, నదీ విహారాలు నాడు
నోటికి చిక్కంతో గృహ బందీలుగా నేడు
పచ్చటి పల్లె జీవితం నాడు
పొగల కల్మషంతో పట్టణ జీవితం నేడు
నాటికి నేటికీ తారతమ్యం తలపోస్తూ
చేయగలిగిందేదో చూద్దాం.
Also read: భోగిమంటలు
Also read: “వివేకానందులు”
Also read: “యుగ యుగాల చరిత్ర”
Also read: “పురోగతి”
Also read: “మిడిల్ క్లాస్”