సిరివెన్నెల సీతారామశాస్త్రితో రచయిత విశ్వపతి
విశ్వపతి
ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది…those whom Gods love die young అని…ఈరోజు అది అక్షరాలా నిజం అనిపించింది…లేకపోతే శాస్త్రి గారు ఇంత అర్ధాంతరంగా వెళ్ళిపోవడమా?…ఈ మధ్య కాలం లో ఎప్పుడూ ఇంత బాధ పడలేదు…ఆయనతో ఎన్ని అనుభూతులు…సినిమారంగం లో వాళ్ళు అప్పుడప్పుడూ ఎవరో ఒకరు కలుస్తున్నా , నాకు ఎంతో దగ్గర అయిన వారు శాస్త్రి గారు ఒక్కరే !…ఇరవై ఒక్క ఏళ్ల క్రితం పరిచయం…నేను సంతోషనగర్ లో ఉండే వాడిని…ఫోన్ చేసినప్పుడు మొదట ఆయన అనే మాట ‘ మహానుభావా ! మార్తాండ తేజా !’…రాస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి….ఎప్పుడూ ఫోన్ చేసినా ఇలాగే ప్రారంభించే వారు…మీరు నగరిలో ఆ మూల సౌధంబు లో అన్నట్లు ఎక్కడో వుంటారు…ఇటు పక్కకి వచ్చేయండి స్వామీ అనే వారు…అలాగే 2001 లో ఇటు పక్కకి వచ్చేసాను…చిన్న పిల్లాడి మనసత్వం…ఒకరోజు ఫోన్ చేసి మహానుభావా మీ మీద ఒక కథ రాశాను అని ఆ కథ మొత్తం చదివారు…ఇది రచన ప్రత్యేక సంచిక కోసం అనుకుంటా 2002 లో రాశారు…విశ్వపతి అనే పేరుతో ఒక ఉదాత్త మైన పాత్రని సృష్టించి రాశారు…
ఆరోజుల్లో రెండు మూడు సంవత్సరాలు వారి పుట్టిన రోజున వారి ఇంటి terrace పైన అత్యంత ఆత్మీయులను పిలిచి సాయంత్రం చక్కటి విందు , చక్కటి కబుర్లు…అందులో నాకూ ఆహ్వానం…ఎన్ని జన్మల బంధం కాకపోతే ఇంతటి ఆత్మీయత…ఒకసారి మేము ఇల్లు మారినప్పుడు ఇంటికి వచ్చి ఏవో కబుర్లు చెప్తూ భోజనం చెయ్యమంటే ఓ బ్రహ్మాండం గా అని చక్కగా నేల మీద బాసింపీట వేసుకుని భోజనం చేసిన రోజు ఎలా మర్చిపోతాను?….
అమృత దర్శనం ఎంతో నచ్చి నేనున్, శాస్త్రి గారు , శ్రీరామ్ ( వారి తమ్ముడు ) జన్మ జన్మల బంధాల గురించి మూడు గంటలు మాట్లాడుకున్న రోజు ఎలా మర్చిపోను ?
ఇలా రాస్తూ పోతే ఎన్నో…ఆ కుటుంబానికీ ఎంతో ధైర్యం ఇవ్వాలని ఆ శ్రీనివాసుని ప్రార్ధిస్తున్నాను…మా సీతారామ శాస్త్రి తెలుగు జాతికి ఒక్కడే…మళ్లీ అటువంటి మహానుభావుడు పుట్టడు…పుట్టడు…
ఆశ్రునాయనాలతో
విశ్వపతి