రేగళ్లను రక్తంతో తడిపిందెవరు,
నాగళ్లను క్రూర నారాచాలుగా మార్చిందెవరు,
చల్లని కళ్ళకు క్రోధారుణ కలికం పెట్టినదెవరు,
కోతలు కోసే కత్తితో కుత్తుకలు
కత్తిరించ వచ్చని చెప్పిందెవరు!?
విత్తు విత్తడం, నీళ్లు పట్టడం, కలుపు తీయడం,
కుప్ప నూర్చడం తప్ప తెలీని స్వేచ్చా జీవులను
విచ్చుకత్తుల రాజకీయ ఉచ్చులోనికి లాగిందెవారు!
చేలకు పట్టిన చీడ వదిలించే రైతు
తనను చుట్టుముట్టిన మహమ్మారిని
తుదముట్టించ లేడా!
Also read: కొందరు అంతే
Also read: రాజకీయం
Also read: ద్వంద్వాలు
Also read: కాలం
Also read: ఇజం
Any revolutionary poem